క్రిస్మస్ పర్వదినాన్ని సుఖసంతోషాలతో జరుపుకోవాలి
ఒంగోలు సిటీ: ఏసు క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యేలు, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కేపీ నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు చుండూరు రవిబాబు, దద్దాల నారాయణ యాదవ్ ఆకాంక్షించారు. ప్రేమ, కరుణ, దయ, జాలి, క్షమాగుణాలను కలిగిన ఏసుక్రీస్తు జీవితం సర్వమానవాళికి ఆదర్శప్రాయమన్నారు.
క్రీస్తు చూపిన కరుణ, ప్రేమ మార్గంలో నడవాలి
ఒంగోలు అర్బన్: క్రీస్తు చూపిన కరుణ, ప్రేమ, సహనం తదితర మార్గాల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరుతూ క్రైస్తవులందరికీ కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు మనుషులను సన్మార్గంలోకి నడిపిస్తాయని అన్నారు.
రేపు ఒంగోలులో సీపీఐ శతాబ్ది ఉత్సవాల ప్రారంభ సభ
ఒంగోలు టౌన్: దేశంలోని నిరుపేదల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల ప్రారంభ సభ ఒంగోలులో ఈ నెల 26వ తేదీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అద్దంకి బస్టాండు నుంచి బయలుదేరి రీడింగ్ రూం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సీవీఎన్ రీడింగ్ రూం ఆవరణలో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య, మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు, ప్రజా నాట్యమండలి గౌరవ సలహాదారు నల్లూరి వెంకటేశ్వర్లు హాజరుకానున్నట్లు తెలిపారు. అభ్యుదయవాదులు, విద్యావంతులు, పార్టీ అభిమానులు, ప్రజలు విరివిగా సభలను జయప్రదం చేయాలని కోరారు.
జిల్లాలో సరాసరి 2.9 మి.మీ వర్షపాతం
● చల్లటి గాలులతో ప్రజల ఇబ్బందులు
ఒంగోలు అర్బన్: జిల్లాలో మంగళవారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి చలిగాలులతో కూడిన చిరుజల్లులు ప్రజలను వణికించాయి. జిల్లాలో సరాసరి 2.9 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్ద వర్షం లేకపోయినా తుప్పర్లతో వర్షం కురిసింది. వాతావరణం బాగా చల్లబడటంతో ప్రజలు చలితో వణికిపోయారు. అత్యధికంగా కొత్తపట్నం మండలంలో 11.4 మి.మీటర్ల వర్షపాతం కురవగా జరుగుమల్లి 10, నాగులుప్పలపాడు 8, చీమకుర్తి 7, ఒంగోలు, తాళ్లూరు 6.4, ిసంతనూతలపాడు, మద్దిపాడు 6, సింగరాయకొండ 5.8, కొండపి 5.4, దర్శి, టంగుటూరు 4.2, ముండ్లమూరు 3.8, పొన్నలూరు 3.2, మర్రిపూడి 3, యర్రగొండపాలెం, దొనకొండ, మార్కాపురం, కొనకనమిట్ల, కనిగిరి, పామూరుల్లో 2, సీఎస్‌పురం 1.4, పెద్దారవీడు 1.2, కురిచేడు, తర్లుపాడు, హెచ్‌ఎంపాడు, వెలిగండ్ల మండలాల్లో 1 మి.మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్
ఒంగోలు అర్బన్: స్థానిక మామిడిపాలెంలోని ఈవీఎం గోదామును వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూముతో పాటు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా చర్యలను పరిశీలించారు. అనంతరం గోదాము రిజిస్టర్‌లో సంతకాలు చేశారు. దీనిలో కలెక్టర్‌తో పాటు ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, వైఎస్‌ఆర్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు కోనేటి వెంకటరావు, రాశేఖర్, రసూల్, రఘురామ్, సిబ్బంది రాజశేఖర్‌రెడ్డి, ఉపేంద్ర, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment