వసతి గృహంలో పదో తరగతి విద్యార్థులు సరిగ్గా చదువుతున్నారా, లేదా అనేది గుర్తించడం, వారిని చదివించడం, ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం వంటివి 100 రోజుల ప్రణాళికలో భాగం. అయితే జిల్లా స్థాయి అధికారులు ఇంత వరకూ పట్టించుకోకపోవడం గమనార్హం. ముందస్తు ప్రణాళికలో భాగంగా జిల్లా స్థాయి అధికారులు వసతి గృహ అధికారులతో టెలీ, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించాల్సి ఉంది. విద్యార్థులు ఎలా చదువుతున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అనే అంశాలను చర్చించాల్సి ఉంది. ఆ దిశగా అధికారుల చర్యలు చేపట్టకపోవడం పది విద్యార్థులకు శాపంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment