అండర్ 12 క్రికెట్ జట్టు ఎంపికకు విశేష స్పందన
ఒంగోలు: అండర్ 12 క్రికెట్ జట్టు ఎంపికకు విశేష స్పందన లభించింది. స్థానిక మంగమూరు డొంక సబ్ సెంటర్ క్రికెట్ గ్రౌండ్‌లో మంగళవారం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 12 క్రికెట్ జట్టు ఎంపిక నిర్వహించారు. ఎంపిక ప్రక్రియను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్‌లు సుధాకర్, చంద్ర, లెఫ్ట్ శ్రీను, బాబూరావు పర్యవేక్షించారు. మొత్తం 50 మంది క్రీడాకారులు హాజరుకాగా వారి నుంచి 26 మందితో ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశామని, వారికి ఈనెల 29 నుంచి బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతల క్రికెట్ స్టేడియంలో రెండు రోజుల క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించి ప్రతిభ చూపిన వారితో తుది జట్టు ఎంపిక చేస్తామని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు తెలిపారు. తుది జట్టుకు ఎంపికై న వారు జనవరి 9వ తేదీ నుంచి కృష్ణాజిల్లా మూలపాడులో జరిగే అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి బచ్చు శ్రీనివాసరావు, సభ్యులు నవీన్, హనుమంతరావు, డాక్టర్ నామినేని కిరణ్, కొత్తూరు బలరాం, అప్పాజి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment