జిల్లాలో బెల్డుషాపుల్లో ప్రీమియం బ్రాండ్‌ల విక్రయాల విషయంలో ప్రత్యేక కోడ్‌లు ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. లైసెన్స్ మద్యం దుకాణాల నుంచి బెల్ట్ షాపులకు విక్రయించే మద్యం సీసాలకు ఉన్న లేబుల్‌ను తొలగించి సరఫరా చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా, ఎక్కడైనా అక్రమ మద్యం సీసాలు పట్టుకున్నా ఏ షాపుదో తెలియకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే ప్రీమియం బ్రాండ్‌లపై మాత్రం ఎస్‌పి అనే ముద్ర వేసి విక్రయిస్తున్నారు. కొనకనమిట్ల ప్రాంతంలో రాయల్‌స్టాగ్ మీద ఎస్‌పి అనే సొంత ముద్ర వేసుకొని విక్రయించడం కనిపించింది. ఎస్‌సి అనేది ఏంటి అని ఎవరైనా అడిగితే దానికి వారు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. ఎస్‌పి అంటే స్పెషల్ పర్మిషన్ అని, ఈ ముద్ర ఉంటే ఎవరూ పట్టుకోరని బెల్టు దుకాణం నిర్వహణదారులు చెబుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment