రుద్రసముద్రం ఘటనపై డీఎస్పీ విచారణ
దొనకొండ: మండలంలోని రుద్రవరం గ్రామంలో తన భార్యకు మరొకరు సెల్‌ఫోన్ కొనివ్వడంపై ఆగ్రహించిన దుగ్గెంపూడి మల్లికార్జున.. ఎస్టీ కులానికి చెందిన మోటా వెంకటేశ్వర్లు రేకుల షెడ్, ఆటో, రెండు బైకులను తగలబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రుద్రసముద్రం చేరుకున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ స్థానికులకు విచారించారు. ఘటన పూర్వాపరాలపై ఆరా తీశారు. ‘వెంకటేశ్వర్లు సెల్ ఫోన్ కొనిచ్చి నీతో మాట్లాడాలని బలవంతం చేయబోయాడ’ని మల్లికార్జున భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే ‘మా నివాసాన్ని, ఆటో, బైకులను కాల్చి, అంతు చూస్తాం, ఊరి నుంచి వెళ్లిపోండి’ అని మల్లికార్జున బెదిరించడంపై మోటా శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. ఇరువర్గాల వాంగ్మూలాలు తీసుకున్నామని, విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఆయన వెంట సీఐ డి.హసన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment