బాలాజీకి తెలుగు కీర్తి జాతీయ పురస్కారం
టంగుటూరు: అంతర్జాతీయ ప్రామాణిక సంస్థగా గుర్తింపు పొందిన శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో తన్నీరు బాలాజీ కి తెలుగు కీర్తి జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. బాలాజీ కందుకూరులో మహతి సాహితీ సాంస్కృతిక సంస్థను స్థాపించి పద్య కవిగా, సాహితీ వేత్తగా, గాయకునిగా కార్యక్రమాలు నిర్వహించారు. టంగుటూరు మండల విద్యాధికారిగా, భారత స్కౌట్స్ అండ్ గైడ్ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహతి సంస్థ ద్వారా అనేక అష్టావధానాలు, కవి సమ్మేళనాలు, పద్య కవితా పోటీలు నిర్వహించడమే కాకుండా అనేక జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం భాషా సేవ చేసే సాహితీవేత్తలకు తన్నీరు కోటయ్య స్మారక జాతీయ పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. తెలుగు కీర్తి పురస్కారాన్ని అందుకున్న బాలాజీని జిల్లా విద్యాశాఖాధికారి ఏ.కిరణ్‌కుమార్, డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వరరావు, డీసీఈబీ సెక్రటరీ మర్రి శ్రీనివాస్, ఒంగోలు ఎంఈఓ కిషోర్‌బాబు, ఎంఈఓ లు చెంచుపున్నయ్య, వెంకారెడ్డి, నాగేంద్రవదన, రామారావు, హరిబాబు, రమణయ్య, స్కౌట్స్ అండ్ గైడ్ అసోసియేషన్ కార్యవర్గం పర్రె వెంకటరావు, కె.వి.శేషారావు, హేబ్సిబా, పలువురు ఉపాధ్యాయులు బాలాజీని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment