ఒంగోలు మెట్రో: జిల్లా గ్రంథాలయంలో బుధవారం ఉదయం పది గంటలకు ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో సాహిత్య వ్యాసాంగంలో, నూతన విద్యా రంగంలో, గ్రాంధిక భాష కాకుండా వ్యవహారిక భాషను వాడాలన్న మహోద్యమానికి ప్రాణం పోసిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు 85వ వర్ధంతి సభ నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ నూనె అంకమ్మరావు, కుర్రా ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో అతిథులుగా, వక్తలుగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాడు తేళ్ళ అరుణ, నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి తదితరులు పాల్గొంటారన్నారు.
23న సీ్త్ర, పురుషుల
కబడ్డీ జట్ల ఎంపిక
చినగంజాం: 71 వ అంతర జిల్లాల సీ్త్ర, పురుషుల కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టును ఈ నెల 23 వ తేదీ ఎంపిక చేయనున్నట్లు ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ మన్నెం శ్రీకాంత్, కార్యదర్శి చెరుకూరి పుల్లయ్య తెలిపారు. 23 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చినగంజాం మండల కార్యాలయం సమీపంలోని సోపిరాల లలితా పరమేశ్వరి రామకోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా సీనియర్ పురుషులు, మహిళల జట్లు ఎంపిక జరుగుతుందని తెలిపారు. పురుషుల బరువు 85 కిలోలు లోపు, మహిళల బరువు 75 కిలోల లోపు ఉండాలన్నారు. ఈ ఎంపికలకు వచ్చే క్రీడాకారులు తమ వెంట ఆధార్ కార్డులు తీసుకొని రావాలన్నారు. ఎంపికై న జట్లు ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా అంకుపాలెం జరిగే అంతర జిల్లాల సీ్త్ర, పురుషుల కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని పూర్తి వివరాలకు ఫోన్ నంబర్లు 6301015775, 9966986373 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment