రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపు ఆశాజనకంగా లేదు
వికసిత్ భారత్‌ను దృష్టిలో ఉంచుకుని జీడీపీ పెంచేందుకు వ్యవసాయ రంగానికి, ఉత్పాదక రంగానికి ప్రాముఖ్యత ఇవ్వడం మంచిదే కానీ రాష్ట్రానికి సంబంధించి కేటాయించిన బడ్జెట్ మాత్రం ఆశాజనకంగా లేదు. పన్ను రాయితీ, శ్లాబ్ పద్ధతి వల్ల ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలకు భారీగా ఊరట లభించినా బడ్జెట్‌లో నిత్యవసర సరుకుల తగ్గుదలపై అనుకున్నంత ప్రాముఖ్యత లేకపోవడం బాధాకరం. మొత్తం మీద నిర్దేశిత లక్ష్యాల కోసం ప్రో యాక్టివ్ బడ్జెట్‌లా ఉంది. బడ్జెట్‌పై పార్లమెంట్లో జరిగే చర్చలో రాజకీయాలకు అతీతంగా అందరూ ప్రజా ప్రతినిధులు మన రాష్ట్రానికి మరింత మెరుగైన కేటాయింపులు జరిగేలా చర్చించాలి.
– ఎం నాగేశ్వరరావు, చైర్మన్, రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య
Comments
Please login to add a commentAdd a comment