మరింతగా సామాజిక అంతరాలను పెంచే బడ్జెట్
కేంద్ర బడ్జెట్ పేదరిక రహిత వికసిత్ భారత్ కోసం కాదు, మరింతగా సామాజిక అంతరాలను పెంచే బడ్జెట్. ముఖ్యంగా విద్య, వైద్యం మరింత కార్పొరేటీకరణ చేసేందుకు ఉపయోగపడుతోంది. సామాజిక వర్గాల సంక్షేమానికి కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించడమంటే ఆ వర్గాలను నిర్లక్ష్యం చేయటమే. క్యాన్సర్ తదితర వ్యాధుల మందుల రేట్లు తగ్గించి మిగతావి మరింత ప్రీమియం చేయడం సరైన చర్యకాదు.
– బి.సుబ్బారావు, సీపీఐ ఎంఎల్ రెడ్‌స్టార్ జిల్లా కార్యదర్శి
జిల్లాకు ఎటువంటి కేటాయింపులు లేవు
ప్రకాశం జిల్లాకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం. జిల్లాకు తీవ్రంగా అన్యాయం చేశారు. వెనుకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లాను గుర్తించినా నిధుల కేటాయింపు లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వచ్చే సవరణ బడ్జెట్‌లో అయినా జిల్లాకు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి.
– ఎస్.కే.మాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment