● ఏపీ టీచర్స్ గిల్డ్ వినతి
ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలను విద్యాశాఖ కమిషనర్ పరిష్కరించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, ప్రభాకరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఉమ్మడి జిల్లాలో 138 ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రస్తుతం 615 మంది ఉపాధ్యాయ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు మండలం, చెరుకూరు గ్రామంలోని ఆంధ్రకేసరి మెమోరియల్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా వారు వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వలేదని, గత 12 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కొమరోలు మండలం గోపానపల్లి ఏబీఎం ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఆంజనేయులు జీతాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యాజమాన్యాల్లోని ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వార్షిక ఇంక్రిమెంట్ల సమస్య, జీరో ఎన్‌రోల్ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను శాశ్వతంగా ప్రభుత్వ పాఠశాల్లోకి సర్దుబాటు చేయాలని విద్యాశాఖ డైరెక్టరు వి.విజయరామరాజును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment