కార్మిక ప్రజాస్వామ్యం అవసరం
ఒంగోలు టౌన్: విస్తారమైన ప్రజల హక్కులను కాపాడుకునేందుకు కార్మిక ప్రజాస్వామ్యం రూపొందించుకోవాలని మార్కిస్ట్ పత్రిక సంపాదకుడు ఎస్ వెంకటరావు పిలుపునిచ్చారు. లెనిన్ శత వర్ధంతి ముగింపు సందర్భంగా మంగళవారం సుందరయ్య భవనంలో పెట్టుబడి–ప్రజాస్వామ్యం అనే అంశం మీద సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూర్జువా పెట్టుబడిదారులను కాపాడేందుకు ఈ ప్రజాస్వామ్యం ఉందని చెప్పారు. కమ్యూనిస్టులు కార్మికవర్గ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రూపొందించుకోవాలన్నారు. ప్రతి కార్మికుడికి, శ్రామికుడికి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలని చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కె మాబు మాట్లాడుతూ మార్క్సిజాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో లెనిన్ కీలకపాత్ర పోషించారని చెప్పారు. సామ్రాజ్యవాదం నిరంతరం యుద్ధాలను కోరుతుందని, ప్రజా స్వామ్యాన్ని నాశనం చేసేది కూడా వాళ్లేనని చెప్పారు. తొలుత లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులు వైజ సిద్దయ్య, జీవీ కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment