జీజీహెచ్‌లో అరుదైన శస్త్ర చికిత్స
ఒంగోలు టౌన్: నాసికా సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళకు జీజీహెచ్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కాకినాడకు చెందిన 30 ఏళ్ల నందిని అనే మహిళ గత కొంతకాలంగా నాసికా సంబంధమైన సమస్యతో ప్రైవేట్ వైద్యశాలల చుట్టూ తిరిగారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఇటీవల ఒంగోలు జీజీహెచ్‌లో ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించారు. బయాప్సీ పరీక్ష అనంతరం ఆమె అరుదైన రినోస్పోరిడియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. వ్యాధి ముదరడంతో ముక్కు కండ పెరిగి శ్వాస ఆడని పరిస్థితిలో ఉన్న ఆమెకు వెంటనే శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం నందిని పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
వైద్యులకు అభినందనలు
అరుదైన రినోస్పోరిడియోసిస్ వ్యాధితో బాధ పడుతున్న మహిళకు విజయవంతంగా ఆపరేషన్ చేసిన జీజీహెచ్‌లోని ఈఎన్‌టి వైద్యుల బృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు అభినందించారు. మంగళవారం జీజీహెచ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల వచ్చే ఈ అరుదైన వ్యాధిని సకాలంలో గుర్తించడమే కాకుండా వెంటనే ఆపరేషన్ చేసి రోగి ప్రాణాలను కాపడామని చెప్పారు. సమావేశంలో ఈఎన్‌టీ హెచ్‌ఓడీ ప్రభాకర్, అసోసియేట్ ప్రొఫెసర్లు పీవీ సంపత్ కుమార్, పి.రాంబాబు, అనస్తీషియా హెచ్‌ఓడీ జయసుందరం, అసోసియేట్ ప్రొఫెసర్లు పి.చలపతి రావు, త్రినాథ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.హిమబిందు పాల్గొన్నారు.
కాకినాడకు చెందిన మహిళకు రినోస్పోరిడియోసిస్ ఆపరేషన్ చేయగా కోలుకున్నట్లు వైద్యుల వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment