ప్రాణం తీసిన నిర్లక్ష్యం!
కనిగిరి రూరల్: విద్యుత్ స్తంభంపై నుంచి పడి ప్రైవేట్ విద్యుత్ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం కనిగిరి మండలం వంగపాడులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గురువాజీపేట సబ్ స్టేషన్‌న్ పరిధిలో జూనియర్ లైన్‌మన్ ఎన్.మహేశ్వరరెడ్డి వంగపాడు పొలాల్లో విద్యుత్ లైన్ మరమ్మతులు చేసేందుకు గ్రామానికి చెందిన కుమ్మరికుంట దేవరాజు(21)ను పిలిచాడు. స్తంభంపై దేవరాజు పనిచేస్తున్న క్రమంలో విద్యుత్ ప్రసారం కావడంతో షాక్‌కు గురై కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి కుమ్మరికుంట చిట్టిబాబు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చేతికంది వచ్చిన కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని ఆరోపించారు.
ఉత్సాహంగా రంగోత్సవ్ పోటీలు
సంతనూతలపాడు: జిల్లా స్థాయి రంగోత్సవ్ పోటీలు సంతనూతలపాడు మండలంలోని మైనంపాడు ప్రభుత్వ డైట్ కళాశాల ఆవరణలో మంగళవారం ఉత్సాహంగా సాగాయి. డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ సామ సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా ఏఎస్పీ అశోక్ బాబు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో ఎం.చైత్రన్, డ్రాయింగ్లో జి.శృతి, హ్యాండ్ రైటింగ్‌లో వి.యామిని, రంగోలిలో జి.వైష్ణవి, ఫోక్ డ్యాన్స్లో శివపార్వతి, డిజిటల్ కాలేజ్‌లో రాహుల్, స్లోగన్ రైటింగ్‌లో ఎస్.నీలిమ, రోల్ ప్లేలో షేక్ ఆసిఫ్ భాను విజేతలుగా నిలిచారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సీహెచ్ మాధవీలత, ఎం శ్రీనివాసరావు, ఎం.మురళీ కృష్ణ, ఎం.శర్మ, ఎం.ఇందిరాదేవి వ్యవహరించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment