12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి
ఒంగోలు సిటీ: ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ హై, డి.వీరాంజనేయులు కోరారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కలెక్టర్‌కు తమీమ్ అన్సారియాకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ప్రకటించాలన్నారు. 2023 జూలై ఒకటి నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా నేటికీ కమిటీని కూడా నియమించకపోవడం వల్ల 18 నెలల కాలాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అంతే కాకుండా 11వ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు రూ.7384 కోట్లు, డీఏ బకాయిలు రూ.9,650 కోట్లు, ఎంప్లాయి సరెండర్ లీవ్ బకాయిలు రూ.2250 కోట్లు, సీపీఎస్ బకాయిలు రూ.2500 కోట్లు, ఏపీ జీఎల్‌ఐ బకాయిలు రూ.950 కోట్లు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంతోపాటు ఐఆర్ 29 శాతం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్య క్షులు ఎస్.రవి, జిల్లా సహధ్యక్షురాలు జి.ఉమామహేశ్వరి, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, ఎం.సంధ్యారాణి, నారాయణ, ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే 18 నెలల కాలాన్ని కోల్పోయాం ఐఆర్ 29 శాతం ప్రకటించి, బకాయిలు విడుదల చేయాలి కలెక్టర్‌కు యూటీఎఫ్ నాయకుల మెమోరాండం
Comments
Please login to add a commentAdd a comment