గైడూ లేదు.. గైడెన్సూ లేదు.! | - | Sakshi
Sakshi News home page

గైడూ లేదు.. గైడెన్సూ లేదు.!

Published Mon, Feb 3 2025 12:49 AM | Last Updated on Mon, Feb 3 2025 12:49 AM

గైడూ

గైడూ లేదు.. గైడెన్సూ లేదు.!

ఒంగోలు వన్‌టౌన్‌:

దో తరగతి పబ్లిక్‌ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. పరీక్షలకు కేవలం 41 రోజులే సమయం ఉంది. కానీ, సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న పేద విద్యార్థులకు నేటికీ ఆల్‌ ఇన్‌ వన్‌ గైడ్‌లు అందలేదు. దీంతో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి హాస్టల్‌ విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. అయినప్పటికీ సంబంధిత పాలకులు, అధికారుల్లో ఏమాత్రం చలనం ఉండటం లేదు. ఇంటి వద్ద ఉండి చదువుకునే స్థోమత లేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సొంత జిల్లాలోనే హాస్టల్‌ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు విద్యాధికులు కాకూడదనే లక్ష్యంతో పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

జిల్లాలోని హాస్టళ్లలో 1,679 మంది పదో తరగతి విద్యార్థులు...

జిల్లాలోని 86 ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో 1,679 మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, పబ్లిక్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పాటు అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు సరైన విద్యా ప్రణాళిక అమలుకాలేదు. దీంతో వారి భవిష్యత్తు అయోమయంలో పడింది. ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్‌ ఇచ్చి ఎప్పటికప్పుడు సామర్థ్యపు పరీక్షలు నిర్వహించి తీర్చిదిద్దుతుండగా, ప్రభుత్వ వసతి గృహ విద్యార్థుల గురించి కనీసం పట్టించుకునేవారు కూడా కరువయ్యారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సకాలంలో గైడ్‌లు అందజేయడంతో పాటు పక్కాగా విద్యా ప్రణాళిక అమలు చేయగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సరైన స్టడీ మెటీరియల్‌ కూడా ఇంత వరకూ అందించలేదు.

41 రోజుల్లో పరీక్షలున్నా పట్టించుకోని

కూటమి ప్రభుత్వం...

పదో తరగతి పరీక్షలకు కేవలం 41 రోజులే సమయమున్నా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో హాస్టల్‌ విద్యార్థులకు నేటికీ గైడ్లు అందించలేదంటే.. ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే పనిలో కూటమి సర్కార్‌ నిమగ్నమైంది. అందులో భాగంగా వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులను నిర్లక్ష్యంగా వదిలేసిం

సంక్షేమ వసతి గృహాల్లోని పదో తరగతి

విద్యార్థులకు నేటికీ అందని ఆల్‌ ఇన్‌ వన్‌ గైడ్‌లు

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి

సొంత జిల్లాలోనే విద్యార్థులకు అవస్థలు

అధికారుల నిర్లక్ష్యంతో టెండర్‌ ఖరారు

దశలోనే ఉన్న గైడ్ల ముద్రణ

పబ్లిక్‌ పరీక్షలకు కేవలం 41 రోజులే ఉన్న సమయం

కూటమి ప్రభుత్వంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు తీవ్ర నష్టం

కలెక్టర్‌ సమావేశం నిర్వహించి నెల దాటినా ఫలితం శూన్యం...

హాస్టళ్లలోని పదో తరగతి విద్యార్థులకు 100 రోజుల విద్యా ప్రణాళిక అమలు కావడం లేదని, ఆల్‌ ఇన్‌ వన్‌ గైడ్‌లు అందలేదనే విషయంపై ‘పది డోలాయమానం’ పేరుతో సాక్షి దినపత్రికలో గత డిసెంబర్‌ 25వ తేదీ కథనం ప్రచురితమైంది. దానిపై స్పందించిన కలెక్టర్‌.. అదే నెల 27వ తేదీ సాంఘిక సంక్షేమ శాఖాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వసతి విద్యార్థులకు ఆల్‌ ఇన్‌ వన్‌ గైడ్‌లు వెంటనే అందించాలని ఆదేశించారు. కానీ, నెల రోజులు దాటినా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మానాయక్‌లో ఏమాత్రం చలనం లేదు. జిల్లా పరిషత్‌ నిధుల నుంచి ప్రతి సంవత్సరం ఆల్‌ ఇన్‌ వన్‌ గైడ్‌లను వసతి గృహాల పదో తరగతి విద్యార్థులకు అందిస్తున్నారు. కానీ, ఈ ఏడాది అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో నేటికీ ఆల్‌ ఇన్‌ వన్‌ గైడ్‌లు టెండర్‌ ఖరారు దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు టెండర్‌ ఖరారైనా గైడ్‌లను ముద్రించేదెప్పుడో.. విద్యార్థులకు అందించేదెప్పుడో అర్థంగాని పరిస్థితి నెలకొంది. దీన్నిబట్టి చూస్తే ఈ ఏడాది పదో తరగతి హాస్టల్‌ విద్యార్థులకు ఆల్‌ ఇన్‌ వన్‌ గైడ్‌లు అందడం గగనమే అని తెలుస్తోంది.

దంటూ విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, అధికారుల అలసత్వం కారణంగా హాస్టల్‌ విద్యా

ర్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం గగనంగా మారనుంది. దీనిపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత వైఎస్సార్‌ సీపీ

ప్రభుత్వంలో పక్కాగా 100 రోజుల ప్రణాళిక...

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వసతి గృహాల విద్యార్థులకు ప్రత్యేకంగా 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేశారు. అందులో భాగంగా ముందుగానే ఆల్‌ ఇన్‌ వన్‌ గైడ్లను విద్యార్థులకు అందజేశారు. దీంతో హాస్టల్‌ విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణతతో పాటు మంచి మార్కులు కూడా సాధించారు.

జెడ్పీ సీఈఓ పరిశీలిస్తున్నారు :

పదో తరగతి హాస్టల్‌ విద్యార్థులకు ఆల్‌ ఇన్‌ వన్‌ గైడ్‌ల సరఫరాకు టెండర్లు ఖరారయ్యాయి. గైడ్‌లు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు. ఈ విషయాన్ని జెడ్పీ సీఈఓ పరిశీలిస్తున్నారు.

లక్ష్మానాయక్‌, సాంఘిక

సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
గైడూ లేదు.. గైడెన్సూ లేదు.! 1
1/1

గైడూ లేదు.. గైడెన్సూ లేదు.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement