నేరాల నియంత్రణపై దృష్టి పెట్టండి
మార్కాపురం: నేర నియంత్రణ, పెండింగ్ కేసులపై పోలీసు అధికారులు దృష్టి పెట్టాలని గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశించారు. ఆదివారం మార్కాపురం డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ దామోదర్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌తో కేసులు ఛేదించాలన్నారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడవద్దన్నారు. గతంలో నమోదైన కేసులు, ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌తో ఛేదించి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల నియంత్రణ, పరిరక్షణ, నేర నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వాడకం ద్వారా కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యలు, సైబర్ నేరాలపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సీసీ కెమేరాల ప్రాముఖ్యతను వివరించి అందరూ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని, ఫిర్యాదులు స్వీకరించి జవాబుదారీగా ఉండాలని, విధి నిర్వహణలో వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటూ ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని ఐజీ సూచించారు. అనంతరం సబ్‌డివిజన్‌లో నమోదైన వివిధ రకాల కేసుల రికార్డులు, క్రైం రిజిస్టర్లు, రివ్యూ రికార్డులను పరిశీలించి పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐలు సుబ్బారావు, మల్లికార్జున, రామకోటయ్య, సురేష్, ప్రభాకర్‌రావు, ఎస్సైలు సైదుబాబు, అంకమరావు, రాజమోహన్‌రావు, రవీంద్రారెడ్డి, కోటేశ్వరరావు, మహేష్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఐజీ త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment