![18 ఏళ్లు పైబడిన వారందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11snp101-260022_mr-1739301408-0.jpg.webp?itok=TFg7G-Ci)
18 ఏళ్లు పైబడిన వారందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్
● రాష్ట్ర ఎన్‌సీడీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్యామల
మద్దిపాడు: క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఎన్‌సీడీ విభాగం సీనియర్ నోడల్ అధికారి డాక్టర్ శ్యామల అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఏడుగుండ్లపాడు, బసవన్నపాలెం గ్రామాల్లో జరుగుతున్న క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను మంగళవారం ఆయన ఆమె పరిశీలించారు. వైద్య సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి రోజుకు 25 నుంచి 30 కుటుంబాలు లేదా 60 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలన్నారు. బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేయాలని ఆదేశించారు. ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ పరీక్ష చేసిన క్యాన్సర్ అనుమానితుల కేసులను వైద్యాధికారికి రెఫర్ చేయాలన్నారు. వైద్యాధికారి ఆ కేసులను జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన క్యాన్సర్ విభాగానికి తుది పరీక్షల కోసం పంపాలన్నారు. జిల్లా, వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమగ్ర ఆరోగ్య సర్వే నిర్వహించి బీపీ, షుగర్, హెచ్‌బీ పరీక్షలు ఇంటి వద్దే చేయాలన్నారు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఈనెల 17, 18 తేదీల్లో ప్రముఖ సినీ యాక్టర్ గౌతమి ఒక ప్రోమో తయారు చేసేందుకు రానున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. వారి వెంట డాక్టర్ సురేష్, డబ్ల్యూ హెచ్‌ఓ కన్సల్టెంట్ రాజ్ కిరణ్, ఎన్‌సీడీ కన్సల్టెంట్ భగీరధి, ఎన్‌సీడీ, ఆర్.బి.ఎస్.కె నోడల్ అధికారి వాణిశ్రీ, డాక్టర్ ఆనందమోహన్, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment