![ఖోఖో క్రీడాకారుడు శివారెడ్డికి కలెక్టర్ అభినందన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11ong611-260048_mr-1739301408-0.jpg.webp?itok=YChN9vRX)
ఖోఖో క్రీడాకారుడు శివారెడ్డికి కలెక్టర్ అభినందన
ఒంగోలు సిటీ: ఢిల్లీలో జరిగిన మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకై క క్రీడాకారుడు, ప్రకాశం జిల్లా ఎస్.ఆర్.ఆర్ ఖోఖో అకాడమీ క్రీడాకారుడు, ఈదర గ్రామానికి చెందిన శివారెడ్డి మంగళవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.సీతారామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కుర్ర భాస్కరరావు, మమతా ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాస రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రీడా అధికారి రాజరాజేశ్వరి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ తమీమ్‌అన్సారియా చేతుల మీదుగా శివారెడ్డిని సన్మానించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ కప్ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ లో పాల్గొని బంగారు పతకం సాధించడం గర్వకారణం అని, శివారెడ్డిని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో యువత కూడా ఇటువంటి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment