రాజన్న సేవలో ఐజీ | Sakshi
Sakshi News home page

రాజన్న సేవలో ఐజీ

Published Fri, May 10 2024 3:35 PM

రాజన్

వేములవాడ: రాజన్నను ఐజీ రాజేశ్‌కుమార్‌ సక్సేనా గురువారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. అనంతరం వేదోక్త ఆశీర్వచనం గావించారు.

బోధనాస్పత్రిలో వైద్యుల నిరసన

సిరిసిల్లటౌన్‌: వైద్యులపై దాడులు నిలువరించాలని కోరుతూ సిరిసిల్ల జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో గురువారం టీచింగ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌(టీటీజీడీఏ) నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ కోరుట్లలో విధి నిర్వహణలో ఉన్న వైద్యుడు శ్రావణ్‌కుమార్‌, సిబ్బందిపై ఓ రోగి బంధువులు జరిపిన అకారణ దాడిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీటీజీడీఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బైరి లక్ష్మీనారాయణ, వైద్యులు అరుణ్‌కుమార్‌, సుప్రియ, సంతోష్‌, సాయిరాజ్‌, శృతి, సాయికుమార్‌, సుగుణ, ఎం.లక్ష్మీనారాయణ, జయశ్రీ, వరుణ్‌, సాయికృష్ణప్రియ పాల్గొన్నారు.

రాజన్న సేవలో ఐజీ
1/1

రాజన్న సేవలో ఐజీ

Advertisement
 
Advertisement
 
Advertisement