ఉరుములు.. మెరుపులు | Sakshi
Sakshi News home page

ఉరుములు.. మెరుపులు

Published Sun, May 12 2024 11:22 PM

ఉరుములు.. మెరుపులు

● ఎల్లారెడ్డిపేటలో దంచికొట్టిన వర్షం ● నిలిచిన విద్యుత్‌ సరఫరా

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు మండలంలోని పలు గ్రామాల్లో రేకులు ఎగిరిపడ్డాయి. నారాయణపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. ఉరుములు, మెరుపులతో వర్షం పడడంతో సెస్‌ అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. సాయంత్రం మరోసారి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అకాల వర్షాలతో రైతులకు మాత్రం అపార నష్టం వాటిల్లింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement