ఘనంగా ఉర్సు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం సింగారం శివారులోని దర్శావలిగుట్టపై దుర్వేషావలి దర్గా వద్ద బుధవారం ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట నుంచి సందల్(గంధం)ను ఊరేగింపుగా దర్శావలిగుట్ట వరకు తీసుకెళ్లారు. దారి పొడవునా ఆశ్వాలతో ప్రత్యేక నృత్యాలు, డప్పు వాయిద్యాలు, మత గురువుల ప్రార్థనలతో ఊరేగింపు సాగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, నిర్వాహకులు షేక్ అజీజ్, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్‌రావు, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కనిమేని చక్రధర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు హాజరయ్యారు. రాత్రి 8 గంటల నుంచి మొదలైన కవ్వాలి బృందం ప్రదర్శనలు అలరించాయి.
Comments
Please login to add a commentAdd a comment