డీజిల్ ట్యాంకర్ పడి ఒకరి దుర్మరణం
● ఏడుగురికి తీవ్ర గాయాలు
● తాడికల్ గ్రామంలో ఘటన
శంకరపట్నం(మానకొండూర్): రోడ్డు పక్కనున్నవారిపై డీజిల్ ట్యాంకర్ పడిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీ సులు, స్థానికుల కథనం ప్రకారం.. శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులు బుధవారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీనికి హాజరైన సీనియర్ ఖోఖో ప్లేయర్ పూదరి శ్రీనివాస్, సాగంటి ప్రకాశ్ నీళ్లు తాగేందుకు వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్తున్నారు. అదే సమయంలో హుజూరా బాద్ వైపు నుంచి అంబాల్‌పూర్ వెళ్లాల్సిన జాతీయ రహదారి నిర్మాణ సంస్థ డీబీఎల్‌కు చెందిన డీజిల్ ట్యాంకర్ రావడంతో రోడ్డు దిగి, పక్కన నిల్చున్నారు. కరీంనగర్ ఆస్పత్రికి, ఇతర పనుల కోసం వెళ్లడానికి ఆర్టీసీ బస్సు కోసం తాడికల్‌కు చెందిన వంగల కనకమ్మ, తాడిచర్ల సంపత్, ఉప్పరి మధురమ్మ, చింతగుట్టకు చెందిన ఆడెపు లాస్య, ఆడెపు మౌనిక, మంద రాజమ్మ అక్కడే చెట్టు కింద కూర్చున్నారు. డీజిల్ ట్యాంకర్ అక్కడికి చేరుకోగానే పక్కకు ఒరిగి, వారిపై పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ ట్యాంకర్ కింద నలిగి, మృతిచెందాడు. మిగతా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అంతకుముందు మరొకరిని ఢీకొన్న ట్యాంకర్
డీజిల్ ట్యాంకర్ ఈ ప్రమాదానికి ముందు వంకాయలగూడెం వద్ద అదే గ్రామానికి చెందిన జడల రాజయ్యను ఢీకొట్టడంతో అతను గాయపడ్డాడు. గ్రామస్తులు పట్టుకుంటారేమోనన్న భయంతో డ్రైవ ర్ ట్యాంకర్‌ను ఆపకుండా వెళ్లిపోయాడు. ఆ హడావుడిలోనే తాడికల్ గ్రామంలో స్పీడ్ బ్రేకర్ వద్ద సడన్ బ్రేక్ వేయడంతో ట్యాంకర్ గ్రామస్తులపై బోల్తా పడింది.
ట్రాఫిక్ జాం..
సమాచారం అందుకున్న హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌జీ, ఎస్సైలు లక్ష్మారెడ్డి, ఆరోగ్యం సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్యాంకర్ నుంచి డీజిల్ కారడంతో రహదారిపై అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను పక్కకు జరిపించారు. ఆ సమయంలో ట్యాంకర్ నుంచి డీజిల్ ఎక్కువగా కారడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి, చల్లించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని హుజూరా బాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తర లించారు. రహదారి సంస్థకు చెందిన సూపర్‌వైజర్‌పై గ్రామస్తులు చేయిచేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్‌ను గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. మృతుడికి కూతు రు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శ్రీనివాస్ (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment