భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

Published Thu, May 16 2024 12:55 PM | Last Updated on Thu, May 16 2024 12:55 PM

భార్య

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేటకు చెందిన ఎండీ.ముబీన్‌(23) ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ ఎస్సై నరేశ్‌ వివరాల ప్రకారం.. ముబీన్‌ భార్య కొంతకాలంగా కాపురానికి రాకపోవడంతో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై, మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి మజీర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి

కోరుట్ల రూరల్‌: మండలంలోని జోగిన్‌పెల్లికి చెందిన బూరుగుల భూమయ్య(62) అనే గొర్రెల కాపరి వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. భూమయ్య మంగళవారం గొర్రెలు మేపేందుకు వెళ్లాడు. ఎండలో తిరగడంతో సాయంత్రం వాంతులు, విరేచనాలు అయ్యాయి. కుటుంబసభ్యులు స్థానికంగా చికిత్స చేయించారు. తగ్గక పోవడంతో రాత్రి కోరుట్ల తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే చనిపోయాడు. మృతుడికి భార్య కాంతమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

బావిలో పడి వృద్ధుడు..

వీణవంక(హుజూరాబాద్‌): కిష్టంపేటకు చెందిన బొద్దుల బాలయ్య(98) ప్రమాదవశాత్తు బావిలో బుధవారం మృతి చెందాడు. ఎస్సై తిరుపతి వివరాల ప్రకారం.. బాలయ్య బుధవారం సమీపంలోని పొలాల వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో ఆయన మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో వచ్చి, మృతదేహాన్ని బ యటకు తీయించారు. బాలయ్యకు మతిస్థిమి తం సరిగా ఉండదని, ప్రమాదవాశాత్తు బావి లో పడి చనిపోయాడని ఆయన మనవడు రమే శ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

బైక్‌ను ఢీకొన్న కారు

యువకుడికి తీవ్ర గాయాలు

చందుర్తి(వేములవాడ): బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికు ల కథనం ప్రకారం.. చందుర్తి మండలంలోని మల్యాలకు చెందిన యెల్ల రమేశ్‌ బుధవారం ద్విచక్రవాహనంపై చందుర్తి వెళ్తున్నాడు. మల్యాల బస్టాండ్‌లో చందుర్తి నుంచి కోరుట్ల వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి, ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు 108 వాహనంలో వేములవాడ ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య1
1/1

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement