కూతురిపై లైంగిక దాడి కేసులో తండ్రికి 25 ఏళ్ల జైలు | Sakshi
Sakshi News home page

కూతురిపై లైంగిక దాడి కేసులో తండ్రికి 25 ఏళ్ల జైలు

Published Thu, May 16 2024 12:55 PM

-

జగిత్యాల జోన్‌: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ కసాయి తండ్రికి 25 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ బుధవారం తీర్పు చెప్పారు. అంతేకాకుండా, బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మల్లికార్జున్‌ కథనం ప్రకారం.. కోరుట్ల మండలం ఎఖిన్‌పూర్‌కు చెందిన ఎల్లాల తుకారాం వ్యవసాయం చేసేవాడు. భార్య ను కత్తితో పొడిచి, చంపాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. తర్వాత కొడుకు తండ్రితో తెగదెంపులు చేసుకొని, నానమ్మ వద్ద ఉంటున్నా డు. అనంతరం తుకారం రెండో పెళ్లి చేసుకున్నా డు. అతని వేధింపులు భరించలేక ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. తర్వాత, మూడో పెళ్లి చేసుకోగా ఒక కూతురు జన్మించింది. అయితే, అక్టోబర్‌ 14, 2022న రాత్రి తూకారాం తన భార్య, 12 ఏళ్ల కూతురితో కలిసి భోజనం చేసి, నిద్రించాడు. అర్ధరాత్రి సమయంలో ఆ బాలికపై లైంగిక దాడికి పాల్ప డ్డాడు. బిడ్డ కేకలు విని నిద్ర లేచిన తల్లికి జరిగిన సంఘటనను వివరించింది. దీంతో ఆగ్రహించిన ఆమె భర్తను కోప్పడగా, విషయం ఎక్కడైనా చెబితే ఇద్దరినీ పెట్రోల్‌ పోసి, చంపుతానని బెదిరించాడు. రెండు రోజులకు వారు తుకారం మొదటి భార్య కొడుకు మహేశ్‌కు చెప్పారు. అతని సహాయంతో కోరుట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి ఎస్సై సతీశ్‌ కేసు నమోదు చేయగా, సీఐ రాజశేఖర్‌రాజు దర్యాప్తు చేపట్టారు. తూకారాంను అరెస్టు చేసి, కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్‌ సిబ్బంది కోర్టులో బలమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టడంతో నేరం రుజువైంది. దీంతో తుకారాంకు న్యాయమూర్తి జైలుశిక్ష, జరిమానా విధించారు.

హత్య కేసులో నేరస్తుడికి జీవితఖైదు

మేడిపల్లి(జగిత్యాల): హత్య కేసులో నేరస్తుడికి జీవి తఖైదు, జరిమానా విధిస్తూ జగిత్యాల న్యాయస్థా నం తీర్పు వెలువరించిందని ఎస్సై శ్యాంరాజు తెలి పారు. ఆయన వివరాల ప్రకారం.. ఓరుగంటి రాజు, పూదరి లక్ష్మణ్‌.. ఇద్దరిదీ భీమారం మండల కేంద్రం. నాలుగేళ్ల క్రితం పెళ్లి బరాత్‌లో గొడవ ప డ్డారు. రాజు క్షణికావేశంలో లక్ష్మణ్‌ను కత్తితో పొడి చి, హత్య చేశాడు. మృతుడి అన్న సతీశ్‌ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై సుధీర్‌రావు కేసు నమోదు చేయగా సీఐ రాజశేఖర్‌ విచారణ చేపట్టి, కోర్టులో చార్జిషీట్‌ వేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి బుధవారం రాజుకు జీవితఖైదు, రూ.5 వేల జరిమానా విధించారని ఎస్సై పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement