విద్యుత్ సేవల్లో పెద్దపల్లి టాప్
పెద్దపల్లిరూరల్: ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడంలో మనజిల్లా అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సంస్థ సీఎండీ వరుణ్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుదర్శనం తెలిపారు. అదేవిధంగా అధికారులు, సిబ్బంది మెరుగైన పనితీరు కనబర్చి మంచి ర్యాంక్‌లు సాధించారని అన్నారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి చెందిన ఏఈ సైపుదీన్‌కు ప్ర థమ ర్యాంక్ వచ్చిందన్నారు. ఆపరేషన్, మెయింటనెన్స్‌లో ఫోర్‌మెన్ వరకు ఏఈ, సబ్‌ఇంజినీర్.. ఇలా అన్ని విభాగాల సహకారంతోనే జిల్లాకు ఈ గౌరవం దక్కిందని ఎస్‌ఈ పేర్కొన్నారు. మేలో విద్యుత్ వినియోగం అధికంగా ఉన్నా.. ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నామని తెలిపారు. కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసే సత్వరమే మంజూరు చేస్తామని తెలిపారు.
కుక్కల దాడిలో
మేకలు మృతి
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి బస్టాండ్ ప్రాంతంలో అజీజొద్దీన్‌కు చెందిన మేకల మందపై బుధవారం మధ్యాహ్నం కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 4 మేకలు చనిపోయాయి. దీనిపై ఆగ్రహించిన యజమాని అజీజొద్దీన్ చనిపోయిన జీవాలతో కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లి, ధర్నాకు దిగారు. తనకు సుమారు రూ.40 వేల నష్టం వాటిల్లిందన్నారు. గతంలోనూ 5 మేకలను చంపేయడంతో 9 ఫీట్ల ప్రహరీ నిర్మించానని, అయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు హామీ ఇవ్వడంతో బాధితుడు ఆందోళన విరమించాడు. చికెన్ సెంటర్ల వ్యర్థాలను సేకరించడంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment