రాజన్నను దర్శించుకున్న కృష్ణభాస్కర్‌ | - | Sakshi
Sakshi News home page

రాజన్నను దర్శించుకున్న కృష్ణభాస్కర్‌

Published Tue, Nov 19 2024 12:07 AM | Last Updated on Tue, Nov 19 2024 12:07 AM

రాజన్

రాజన్నను దర్శించుకున్న కృష్ణభాస్కర్‌

వేములవాడఅర్బన్‌: వేములవాడ రాజన్నను తెలంగాణ జెన్‌కో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణభాస్కర్‌ సోమవారం రాత్రి దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈవో వినోద్‌రెడ్డి స్వామి వారి ప్రసాదం అందించి సత్కరించారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

వేములవాడఅర్బన్‌: గ్రామాల్లోని సర్పంచులు చేసిన అభివృద్ధి పనుల పెండింగ్‌ బిల్లులు విడుదల చేసేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మనసు మార్చాలని కోరుతూ సోమవారం జిల్లా మాజీ సర్పంచుల సంఘం నాయకులు రాజన్నకు కోడె మొక్కులు చెల్లించారు. శివుడి విగ్రహానికి వినతిపత్రం అందించారు. మాజీ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు అక్కనపెల్లి కరుణాకర్‌ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి సర్పంచుల పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తరువాత 11నెలలుగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విలీన గ్రామాలను జీపీలుగా మార్చాలి

సిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామపంచాయతీలను మళ్లీ జీపీలుగా మార్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. సిరిసిల్ల కార్మిక భవన్‌లో సోమవారం మాట్లాడారు. సిరిసిల్లలో ఏడు, వేములవాడలో ఐదు గ్రామాలను కలిపి ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పనులు లేకుండా చేశారని ఆరోపించారు. పట్టణాల్లో కలిపిన పల్లెలను వేరు చేసి గ్రామపంచాయతీలుగా మార్చాలన్నారు. దీనిపై వేములవాడలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని విలీనమైన సర్దాపూర్‌ పెద్దూర్‌ ముష్టిపల్లి, చిన్న బోనాల, పెద్ద బోనాల, చంద్రంపేట, రగుడులను వేరు చేయాలని వేణు కోరారు.

వేములవాడకు రూ.127.65 కోట్లు మంజూరు

వేములవాడఅర్బన్‌: వేములవాడ పట్టణ, ఆలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు సోమవారం మంజూరు చేసింది. రాజన్న ఆలయ కాంప్లెక్స్‌ విస్తరణ, భక్తుల సదుపాయాలకు రూ.76 కోట్లు, రాజ న్న ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్లను వెడల్పు చేసేందుకు రూ.47.85 కోట్లు, మూలవాగులో ఉన్న బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్‌ జంక్షన్‌ వరకు పైపులైన్‌, డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.8 కోట్ల పనులకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రూప్‌–3 పరీక్ష ప్రశాంతం

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: జిల్లాలోని 25కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన గ్రూప్‌–3 పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఆర్‌సీవో వేణుగోపాల్‌ తెలిపారు. మొత్తం 7,062 మందికి అభ్యర్థులకు గానూ 3,757 మంది హాజరు అయ్యారని తెలిపారు. 3,305మంది గైర్హాజరు అయినట్లు వివరించారు.

మిడ్‌మానేరు నిర్వాసితులను మోసం చేయొద్దు

సిరిసిల్ల: మిడ్‌మానేరు నిర్వాసితులను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేయాలని చూస్తోందని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజు యాదవ్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించిన ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పేరిట నాలుగు వేలఇండ్లు ఇస్తామని ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. మధ్యమానేరులోని 10,683 కుటుంబాలకు ఒకేసారి రూ.5.04లక్షల చొప్పున ఆర్థిక ప్యాకేజీని వర్తింపజేయాలని కోరారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి సిరిసిల్ల, వేములవాడ పర్యటించి మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలను ప్రస్తావించారని గుర్తు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రాజన్నను దర్శించుకున్న కృష్ణభాస్కర్‌1
1/2

రాజన్నను దర్శించుకున్న కృష్ణభాస్కర్‌

రాజన్నను దర్శించుకున్న కృష్ణభాస్కర్‌2
2/2

రాజన్నను దర్శించుకున్న కృష్ణభాస్కర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement