సీఎం సభకు తరలిరండి
● వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్: ఈ నెల 20న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడ పర్యటనకు వస్తున్నారని, ఈ సందర్భంగా జరిగే బహిరంగసభకు వేలాదిమంది ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్‌లో సోమవారం జిల్లా కాంగ్రెస్‌పార్టీ విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్, మనకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ నెల 20న బుధవారం వేములవాడకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వస్తున్నారని తెలిపారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్న ట్లు వివరించారు. 2023– 24 బడ్జెట్‌లో ఆలయానికి రూ.50కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. 2018లో మిడ్‌మానేరు ముంపుగ్రామాల ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కింద రూ.5లక్షలు ఇస్తానని మోసం చేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో అనాడు రేవంత్‌రెడ్డి సంకెపల్లిలో పల్లెనిద్ర చేసి ముంపు ప్రజలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారన్నారు. ఆ మాట ప్రకారం 4,696ఇళ్లకు రూ.230 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. యారన్ డిపో తీసుకొచ్చామని, మూలవాగు వంతెనకు భూ సేకరణకు రూ.6కోట్లు మంజూరు చేశామన్నారు. మల్కపేట పనులకు రూ.9కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం రాజన్న గుడి చెరువు పార్కింగ్‌స్థలంలోని సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment