రాజన్న దర్శనం.. అభివృద్ధి పనులు
● అనంతరం బహిరంగ సభ ● వేములవాడలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు ● పరిశీలించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల/వేములవాడఅర్బన్: వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వేములవాడకు బుధవారం ఉదయం 9.15 గంటలకు చేరుకుని శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణంలోనే అల్పహారం చేసి, జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. గుడి చెరువు పార్కింగ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.40గంటల వరకు వేములవాడలో సీఎం పర్యటన ఉంటుందని తాత్కాలిక షెడ్యూల్‌ను నిర్ధారించారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
జిల్లాలో తొలిసారి సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా అధికారులతో సోమవారం ఏర్పాట్లపై సమీక్షించారు. వేములవాడ రాజన్న ఆలయంలోని పరిసరాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ప్రభుత్వశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శానిటేషన్ బాగుండాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్లు సమకూర్చాలని, ఒక్కో గ్యాలరీలో మాని టరింగ్ చేసేందుకు ఒక మండలస్థాయి అధికారి ఏర్పాటు చేయాలన్నారు. పాస్‌లు సిద్ధం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీవోలు రాజేశ్వర్, ఉపేందర్‌రెడ్డి, డీఆర్‌డీవో శేషాద్రి, ‘సెస్’ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి, డీఈవో రమేశ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment