ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● సూరమ్మ ప్రాజెక్టు పనులు ప్రారంభం
రుద్రంగి(వేములవాడ): ఎన్నికల హామీ మేరకు సూరమ్మ ప్రాజెక్టు పనులు ప్రారంభించి మాట నిలబెట్టుకున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి శివారులోని సూరమ్మ ప్రాజె క్టు పనులకు శుక్రవారం భూమిపూజ చేసి మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018 ఎన్నికలకు ముందు సూరమ్మ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసి ఓట్లు దండుకొని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తట్టెడు మట్టి కూడా తీయకుండా పడావు పడగొట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పునర్ ప్రారంభిస్తున్నామన్నారు. గతంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ప్రతీ నెల 22వ తేదీన నిరసనలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అదే 22వ తేదీన ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశామన్నారు. పది నెలల్లోనే రాజన్నసిరిసిల్ల జిల్లా అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, గ్రామాధ్యక్షుడు సామ మోహన్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శులు చెలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, తర్రె లింగం, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, గండి నారాయణ, చిత్తిపాక మల్లయ్య, దేశవేని శ్రీనివాస్, భూమేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment