హన్మంతుడు లంకకు వెళ్లి.. సీతమ్మ జాడను కనుగొనుట నుంచి వానర(కోతులు)సేనతో రామలక్ష్మణులు లంకలోకి వెళ్లి.. రావణ సంహారం చేసి సీతమ్మతో పట్టాభిషేకం జరిగే వరకు ప్రతీ దృశ్యం కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. కళాకారుల నృత్యాలు.. లంక దహనం.. రావణ సంహారం భారీ లైటింగ్స్ మధ్య ఆకట్టుకున్నాయి.
వెనకటి వీధి నాటకమే అయినా.. ఆధునికతను జోడిస్తూ.. అద్భుతమైన సెట్టింగులు.. మైక్‌సిస్టమ్స్‌తో ఓపెన్ థియేటర్‌లో వేలాది మంది విదేశీయులు వీక్షిస్తుండగా ప్రదర్శించడం భారతీయులుగా అక్కడికి వెళ్లిన టూరిస్టులు గర్వపడేలా చేశాయి. మన భాష కాకున్నా అర్థవంతమైన స్క్రీన్‌ప్లేతో రామాయణకావ్యం ప్రదర్శన కట్టిపడేసింది. ఇండోనేషియా ముస్లిం దేశం.. అక్కడ హిందువులు మైనార్టీలు.. కానీ ఆ దేశ కూడళ్లలో మహాభారత దృశ్యాలు.. రామాయణ చిత్రాలు దర్శనమిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment