అభివృద్ధే మా ధ్యేయం
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ● పలు అభివృద్ధి పనులు ప్రారంభం
గంభీరావుపేట(సిరిసిల్ల)/వేములవాడఅర్బన్: అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. గంభీరావుపేట మండలంలో దాదాపు రూ.23కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శనివారం ప్రారంభోత్సవాలు చేశారు. మండలంలోని లింగన్నపేట నుంచి కోరుట్లపేట వరకు కేంద్రం నిధులు రూ.15కోట్లతో నిర్మించిన డబుల్‌రోడ్డును, మల్లారెడ్డిపేట, గంభీరావుపేట మధ్య మానేరువాగుపై రూ.8.30కోట్లతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు మల్లారెడ్డిపేటలోని పురాతన శ్రీవీరాంజనేయస్వామి క్షేత్రంలో, గంభీరావుపేట శివారులోని తాళ్ల ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. బీజేపీ నాయకులు రాణిరుద్రమ, కొక్కు దేవేందర్‌యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, మండలాధ్యక్షుడు గంట అశోక్, నాయకులు రాజేందర్‌రెడ్డి, దేవసాని కృష్ణ, ప్రసాద్‌రెడ్డి, కృష్ణకాంత్‌యాదవ్, మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, నరేశ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
సంకెపల్లిలో సీసీరోడ్లు ప్రారంభం
వేములవాడ మండలం సంకెపల్లిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులు రూ.14లక్షలతో నిర్మించిన సీసీరోడ్లను శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రారంభించారు. బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. వేములవాడ ఆలయాన్ని ప్రసాదం స్కీమ్‌లో చేర్చుతున్నామని ప్రకటించగానే.. సీఎం రాజన్న ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల హామీ ఆరుగ్యారంటీల్లో ఎన్ని అమలవుతున్నాయో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రాజన్న ఆలయానికి ప్రసాదం స్కీమ్ వస్తుందని స్పష్టం చేశారు. గాయపడిని పార్టీ సంకెపల్లి గ్రామాధ్యక్షుడు నాగుల సురేశ్‌ను పరామర్శించారు. వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చెన్నమనేని వికాస్‌రావు, పార్టీ మండలాధ్యక్షుడు చింతపల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ బుర్ర లహరిక, బుర్ర శేఖర్, బండ మల్లేశం, రాజిరెడ్డి, జింక అనిల్, కనకరాజు, నిఖిల్, భాను, అరవింద్, పూర్ణచందర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment