సాగుకు కదిలి
ఆదివారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2024
ఉద్యోగం వదిలి..
కోడిపిల్లల ఉత్పత్తికి ఇంక్యుబేటర్
● సంతృప్తినివ్వని సాఫ్ట్‌వేర్, ఇతర ప్రైవేటు ఉద్యోగాలు ● కోళ్ల పెంపకం, వ్యవసాయం చేస్తున్న పలువురు పట్టభద్రులు
● ఈ పనుల్లోనే మజా ఉందంటున్న వైనం ● ఆదర్శం.. ఉమ్మడి జిల్లావాసులు
రామగుండం: అంతర్గాం మండలంలోని రాయదండికి చెందిన పల్లె రాజుది నిరుపేద కుటుంబం. 2016లో ఉస్మానియా క్యాంపస్‌లో ఎంకాం చదివాడు. కొన్ని నెలలపాటు ప్రైవేటు ఉద్యోగం చేశాడు. దానితో సంతృప్తి చెందలేదు. సొంతంగా ఏదైనా పని చేసి, యువతకు ఉపాధి కల్పించాలనుకున్నాడు. 2017లో స్వగ్రామంలోనే అగ్రి గ్రీన్ ఫామ్స్ పేరిట తొలుత 10 కోళ్లు, 2 పుంజులతో నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాడు. కృత్రిమంగా 2 వేల కోడిగుడ్ల నుంచి కోడిపిల్లలను ఉత్పత్తి చేసేలా ఇంక్యుబేటర్‌కు రూపకల్పన చేశాడు. తర్వాత నాటుకోడి పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాడు. 2018 నుంచి కోళ్ల ఫాంలు పెట్టుకునే రైతులను ప్రోత్సహిస్తూ శిక్షణనిస్తున్నాడు. రాజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదుసార్లు ఉత్తమ యువ పౌల్ట్రీ రైతు అవార్డులతోపాటు 3 జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నాడు. ఇప్పటివరకు దేశంలోని 19 రాష్ట్రాలకు నాటుకోడి పిల్లలు సరఫరా చేశాడు. 5 దేశాలకు నాటుకోడి పచ్చడి ఎగుమతి చేస్తున్నాడు. కడక్‌నాథ్, తెల్లరంగు చీమ, టర్కీ కోళ్లు, ఖజానా బాతులు, అమెరికన్ సిల్కీ కోళ్లు, కుందేళ్లు, అమెరికన్ జాతి పావురాలు, జర్మన్ షెఫర్డ్ కుక్కలు పెంచుతున్నాడు.
శాతవాహన వర్సిటీ
సేంద్రియ సాగు.. పశువుల పెంపకం
చొప్పదండి: పెద్దకూర్మపల్లికి చెందిన మావురం మల్లికార్జున్ రెడ్డి బీటెక్ చదివాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు రూ.లక్ష సంపాదించినా తృప్తినివ్వలేదు. రసాయనాలతో ఆహారం కలుషితమవడాన్ని గుర్తించి, సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్నాడు. విషయాన్ని ఎంసీఏ చదివి, ప్రైవేటు ఉద్యోగం చేసే తన భార్య సంధ్యకు చెప్పడంతో సరే అంది. ఇద్దరూ కలిసి స్వగ్రామం చేరుకున్నారు. 15 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ పశువులు, బావిలో చేపల పెంపకం చేపడుతున్నారు. మల్లికార్జున్‌రెడ్డి జాతీయ ఉత్తమ రైతు అవార్డు అందుకున్నాడు. గతేడాది ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ప్రస్తుతం 100 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో పంటలు పండించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపాడు. సేంద్రియ వ్యవసాయంలో రైతులకు లాభాలు మెండుగా ఉంటాయని, భవిష్యత్‌లో మన దేశం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన పంటలు పండించాలని సూచిస్తున్నాడు.
ప్రజా పోరాటాలకు పెట్టింది పేరైన సిరిసిల్ల కాలానుగుణంగా శరవేగంగా పురోగమిస్తున్న జిల్లా కేంద్రం. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్ననాటి నుంచే ప్రపంచం గుర్తించిన మేధావులకు జన్మనిచ్చిన నేల. పేద, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన ఎంతోమంది ఉన్నత చదువులు చదివారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రొఫెసర్లుగా పని చేశారు. ఉస్మానియా, అంబేడ్కర్, తెలుగు, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీలకు వీసీలుగా బాధ్యతలు నిర్వహిస్తూ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. వీరితోపాటు పలువురు ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులు కూడా ఉన్నారు. –సిరిసిల్ల కల్చరల్
డిగ్రీ, పీజీ వంటి ఉన్నత చదువులు చదివారు.. ఉద్యోగం రాలేదా అంటే.. మంచి ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్, ఇతర ప్రైవేటు ఉద్యోగాలు వచ్చాయి.. కొన్నేళ్లు పని చేశారు.. కానీ, నెలవారీగా జీతం తీసుకునే ఆ జీవితం వారికి సంతృప్తినివ్వలేదు.. ఏం చేస్తే బాగుంటుందని తీవ్రంగా ఆలోచించారు.. అలా.. పలువురు వ్యవసాయం, కోళ్ల పెంపకం వైపు కదిలారు.. పంటలు పండిస్తూ, కోళ్లను పెంచుతూ ఆదాయం పొందుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఈ పనుల్లోనే మజా ఉందని చెబుతున్నారు పలువురు ఉమ్మడి జిల్లావాసులు. వారిపై స్పెషల్ స్టోరీ.
వరి, మొక్కజొన్న, పత్తి సాగు
ఇలంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలంలోని ముస్కానిపేటకు చెందిన బద్దం వరుణ్‌రెడ్డి 2009లో ఎంసీఏ పూర్తి చేశాడు. తొమ్మిదేళ్లు హైదరాబాద్, బెంగళూరు, పుణేల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. వ్యవసాయంపై ఆసక్తితో సాఫ్ట్‌వేర్ రంగాన్ని వదిలేసి, ఇంటికి వచ్చాడు. కుటుంబానికి 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉండటంతో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేస్తున్నాడు. డ్రిప్ ద్వారా మొక్కజొన్న పండిస్తున్నట్లు పేర్కొన్నాడు. వ్యవపాయంలో ఆనందం ఉందని, పనుల కోసం ట్రాక్టర్, హార్వెస్టర్ కొనుగోలు చేసినట్లు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment