సుందరకాండ
ఇండోనేషియాలో
● ఇండోనేషియా గడ్డపై ‘కిష్కిందకాండ’ ప్రదర్శన ● గంటన్నరపాటు మంత్రముగ్ధులను చేసిన కార్యక్రమం ● దేశవిదేశీయులను ఆకట్టుకునేలా ‘మన రామాయణం’
సిరిసిల్ల: హిందూ మహాసముద్రతీరంలో రామాయణ దృశ్యకావ్యం ఆకట్టుకుంది. ఇందులో ఏముందీ ప్రత్యేకత అనుకునేరు. అవును ప్రత్యేకతే ఉంది. హిందూ మహా సముద్ర తీరంలోనే అయినా మన దేశంలో కాదు. ముస్లిం జనాభా అధికంగా నివసించే ఇండోనేషియాలో రామాయణంలోని కాండాలను ప్రదర్శించడమే ప్రత్యేకత. దక్షిణ ఇండోనేషియాలోని కుట పట్టణం హిందూ మహాసముద్రతీరాన్ని ఆనుకుని ఉంటుంది. సముద్రం నుంచి చల్లనిగాలులు వీస్తుండగా.. సుందరకాండ, కిష్కిందకాండాల ప్రదర్శన కుట పట్టణానికి ఇటీవల సిరిసిల్ల నుంచి వెళ్లిన టూరిస్టులకు ప్రత్యేక అనుభూతినిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment