జ్యోతిబా పూలే ఆశయాలు సాధిద్దాం
ముస్తాబాద్(సిరిసిల్ల): సామాజిక విప్లవకారుడు జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్‌చార్జీ కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో ముదిరాజ్ సంఘం ఆధ్యర్యంలో నిర్మించిన పూలే దంపతుల విగ్రహాలను ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూలే ఆశయాలు నెరవేరుస్తుందన్నారు. ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు రాంగోపాల్, రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్, సింగిల్‌విండో చైర్మన్ రాజేందర్‌రెడ్డి, రణవేని లక్ష్మణ్, పర్శ హన్మాండ్లు, కోడి అంతయ్య, రెడ్డబోయిన గోపి, గజ్జెల రాజు, చొక్కాల రాము, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాణి, మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, వైస్‌చైర్మన్ వెల్ముల రాంరెడ్డి పాల్గొన్నారు.
27న రాష్ట్రస్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు
సిరిసిల్లటౌన్: హైదరాబాద్‌లో డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా పురుషులు, మహిళల జట్లను ఎంపిక చేస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సింగారపు తిరుపతి తెలిపారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 27న ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు 75 కిలోలలోపు, పురుషులు 85 కిలోలలోపు బరువు ఉండాలని సూచించారు. టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్‌కార్డు తీసుకుని రావాలని సూచించారు. వివరాలకు 94403 37004, 63094 00105లో సంప్రదించాలని తెలిపారు.
ప్రజారక్షణ పోలీసుల బాధ్యత
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజారక్షణ పోలీసుల బాధ్యత అని, ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించాలని సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి కోరారు. ముస్తాబాద్ మండలం చీకోడులో ఆదివారం మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ మొగిలి మాట్లాడుతూ ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలన్నారు. గ్రామాల్లో అపరిచుతులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సెల్‌ఫోన్‌లలో వచ్చే అపరిచిత మెస్సేజ్ లింకులను ఓపెన్ చేయొద్దని సూచించారు. ఎస్సై గణేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బీడీ కార్మికులకు కనీస వేతనాలివ్వాలి
సిరిసిల్లటౌన్: బీడీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్ కోరారు. సిరిసిల్ల ఏఐటీయూసీ భవన్‌లో ఆదివారం బీడీవర్కర్స్ ఫెడరేషన్ జిల్లా రెండో మహాసభలు నిర్వహించారు. బాలరాజ్ మాట్లాడుతూ అర్హులైన పేద కార్మికులకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలని, కార్మికులకు కనీస పెన్షన్ రూ.6వేలు అందివ్వాలని, జిల్లా కేంద్రంలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. బీడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భోగ గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి సుతారి రాములు, డిప్యూటీ కార్యదర్శి ముఖరమ్, జిల్లా సీపీఐ కార్యదర్శి గుంటి వేణు పాల్గొన్నారు.
ఘనంగా ఎన్‌సీసీ డే
సిరిసిల్ల: తంగళ్లపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం ఎన్‌సీసీ దినోత్సవం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రెహాన ఇఫ్పత్ జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎన్‌సీసీతో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. సామాజిక సేవా భావం అలవర్చుకోవాలన్నారు. కళాశాల పరిసరాల్లో చెత్తను శ్రమదానం చేసి తొలగించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అనూష పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment