న్యాయసేవలు మరింత చేరువ
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత ● వేములవాడ కోర్టులో ఈ–సేవ కేంద్రం ప్రారంభం ● వర్చువల్‌గా ప్రారంభించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
వేములవాడ: జిల్లా ప్రజలకు న్యాయసేవలు మరింత చేరువయ్యాయని జిల్లా జడ్జి ప్రేమలత పేర్కొన్నారు. వేములవాడ కోర్ట్ కాంప్లెక్స్‌లో ఈ–సేవ కేంద్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పామిడిగంటం నరసింహ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత, సీనియర్ సివిల్ జడ్జి, రాధిక జైస్వాల్, జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, ఏజీపీ పుప్పాల భానుకృష్ణ హాజరయ్యారు. ఈ–సేవ కేంద్రం ద్వారా కేసు స్థితిగతులు, తదుపరి విచారణ తేదీ సంబంధిత విచారణలు స్వీకరించడం, సర్టిఫైడ్ కాపీలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, హర్డ్‌కాపీ పిటిషన్ల స్కానింగ్, ఈ–సంతకం, పిటిషన్ల ఈ–ఫైలింగ్‌లను సులభతరమవుతాయన్నారు. ఈ–ములాఖత్ అపాయింట్‌మెంట్ ద్వారా జైలులో ఉన్న బంధువులను కలవడానికి సహాయపడుతుందని తెలిపారు. ఈ–కోర్టు సేవల ద్వారా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్న అన్ని ఇతర సేవల గురించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం దక్కుతుందన్నారు. న్యాయవాదులు పొత్తూరి అనిల్‌కుమార్, గుండా రవి, కిశోర్‌రావు, బొడ్డు ప్రశాంత్, నర్సింగరావు, గొంటి శంకర్, గుజ్జ మనోహర్, జెట్టి శేఖర్, జంగం అంజయ్య, అనిల్, సుజాత, అన్నపూర్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment