బాల్యం.. బలహీనం
● పిల్లల్లో ఆందోళన కలిగిస్తున్న పౌష్టికాహార లోపం ● తక్కువ బరువుతో తరచూ అనారోగ్యం ● ఫలితమివ్వని అవగాహన కార్యక్రమాలు ● ఉమ్మడి జిల్లాలో చిన్నారుల పరిస్థితి ● స్పందించాలంటున్న పేరెంట్స్
రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన ఈ చిన్నారి వయస్సు 40 నెలలు. 95–102 సెం. మీ. ఎత్తు, 13–16 కేజీల బరువు ఉండాలి. కానీ, 9.2 కేజీల బరువు, 85 సెం.మీ. ఎత్తు మాత్రమే ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇలాంటి చిన్నారులు ఎంతోమంది ఉన్నారు.
సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్:
తీవ్ర పోషకాహార లోపం, అతి తక్కువ బరువు, వయసుకు తగిన ఎత్తు లేకపోవడం తదితర కారణాలతో ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది చిన్నారులు(ముఖ్యంగా పేద, మధ్యతరగతివారు) తరచూ అనా రోగ్యానికి గురవుతున్నారు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ సమస్యలు రెట్టింపవుతున్నా యి. ఐదేళ్లలోపు చిన్నారులను రక్తహీనత వెంటాడుతోంది. ఫలితంగా వారిలో ఉత్సాహం కనిపించడం లేదు. తోటి పిల్లలతో ఆడుకోలేకపోతున్నారు. ఇలాంటి వారి ని గుర్తించి, పౌష్టికాహారం అందించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందన్న ఆరోపణలున్నాయి.
బాలామృతం, కోడిగుడ్లు ఇంటికే
మూడళ్లలోపు పిల్లలకు జాతీయ పౌష్టికాహార సంస్థ సూచించిన మా ర్గదర్శకాల మేరకు బాలామృతం, నెలకు 16 గుడ్లు ఇస్తున్నారు. 3–6 ఏళ్లలోపు చిన్నారులకు భోజనం, స్నాక్స్, పాలు, రోజుకొకటి చొ ప్పున నెలకు 30 గుడ్లు అందిస్తున్నారు. వాటిని అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఉడికించి ఇవ్వాలి. ఇంటికి ఇస్తుండటంతో పిల్ల లకు సరిగా అందడం లేదన్న వాదనలున్నాయి.
పర్యవేక్షణ లేక.. ఫలితాలు రాక
గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, బాలామృతం, ఆరోగ్యలక్ష్మి, హెల్త్ చెకప్ తదితర ప్రాజెక్టులు అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోనే ఉంటాయి. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి చిన్నారులకు ఐదేళ్లు నిండే వరకు ఆయా కేంద్రాల ద్వారా వారికి పోషకాహారం అందుతుంది. అలాగే, వారి ఆరోగ్య సంరక్షణ బాధ్యత కూడా అంగన్‌వాడీ సెంటర్లదే. అయితే, పర్యవేక్షణ లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదన్న చర్చ జరుగుతోంది.
ప్రధాన కారణాలివే..
బాల్య వివాహాలు, పేదరికం, అనారోగ్యం, అవగాహన లేమితో సమస్యలు ఉత్పన్నవుతున్నా యి. చిన్న వయసులోనే గర్భం దాల్చిన ఆడవా ళ్లు నెలలు నిండకుండానే ప్రసవిస్తున్నారు. అటువంటి పిల్లలకు పుట్టుకనుంచే అనేక రుగ్మతలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, చిన్నారులకు అందించే పౌష్టికా హారం వారే తినేలా చూడాలి. పౌషకాహార లో పంతో కలిగే ఇబ్బందులపై గర్భిణులు, తల్లుల కు అవగాహన కల్పించాలి. ఐసీడీఎస్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తేనే ఇది సాధ్యమవుతుంది.
వారోత్సవాలతో ప్రయోజనమేది?
గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, వారిలో చైతన్యం తెచ్చేలా ప్రభుత్వం ఏటా పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహిస్తోంది. అయినా, ప్రయోజనం లేకుండా పోతోంది. ఆయా జిల్లాల సంక్షేమ శాఖ అధికారులను వివరణ కోరగా పోషకాహార లోపంతో బాధ పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టిసారిస్తామని తెలిపారు.
పరిష్కార మార్గాలు..
సంతులిత ఆహారమైన ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.
పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం, కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.
తల్లిదండ్రులకు పౌష్టికాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి.
అంగన్‌వాడీ కేంద్రాల సేవలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సద్వినియోగం చేసుకోవాలి.
పిల్లలు బరువు తక్కువగా ఉంటే వైద్యుల సలహాలు పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment