నేడు దీక్షా దివస్
సిరిసిల్లటౌన్: రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ అ ధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షాదివస్‌ను సిరిసిల్లలో శుక్రవారం నిర్వహిస్తున్నారు. ఈమేరకు బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి గురువారం ప్రకటన విడుదల చేశారు. దీక్షాదివస్‌కు ఎమ్మెల్యే కేటీఆర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు కొత్తబస్టాండ్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం, అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు సమర్పణ, 10.30 గంటలకు పాతబస్టాండ్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి, ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో దీక్ష కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.
సైజింగ్ పరిశ్రమను ఆదుకోవాలి
సిరిసిల్లటౌన్: సంక్షోభంలో కూరుకున్న సైజింగ్ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని ఐఎఫ్ టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడం మల్లే శం కోరారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ పద్మశాలి సంఘంలో గురువారం సైజింగ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. యూనియన్ అధ్యక్షుడు వల్లాల కిశోర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం బతుకమ్మ చీరల మీదనే శ్రద్ధ చూపడంతో కాటన్ పరిశ్రమ కుదేలైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాటన్ పరిశ్రమకు ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. సోమిశెట్టి దశరథం, బి.రవీందర్, ఎలిగేటి రాము, కూరపాటి సతీశ్, ఆటో కొమరయ్య, యూసుఫ్, మల్లేశం, చంద్రయ్య పాల్గొన్నారు.
మున్సిపల్ నిర్వహణపై అవగాహన
● పరిశీలించిన ట్రెయినీ అధికారులు
వేములవాడ: మున్సిపల్‌లోని వివిధ శాఖలను పనితీరును ట్రెయినీ అధికారులు గురువారం పరిశీలించారు. ట్రెయినీ ఐపీఎస్‌లు అజయ్‌కుమార్ మీనా, చంద్రకుమార్ అగర్వాల్, గౌరవ్‌గోర్గ్, శివాన్షిశుక్లా, లక్ష్మీప్రియ, అనురాగ్ మీనా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని నీటి సరఫరా, ఇళ్ల అనుమతులు, నిర్మాణం, పరిశీలన, పర్యవేక్షణపై అవగాహన పొందా రు. వీరికి మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, ఏఈ నర్సింహస్వామి వివరించారు.
చెకుముకి టెస్ట్‌లో ప్రతిభ
సిరిసిల్లటౌన్: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. 13 మండలాల నుంచి 35 టీములు పాల్గొన్నాయి. ఒక్కో టీంకు ము గ్గురి చొప్పున పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన నాలుగు టీములు డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పా ల్గొంటారని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు సిలివే రి సంపత్‌కుమార్, గౌరవ అధ్యక్షుడు రంగినేని మోహన్‌రావు, రాష్ట్ర కార్యదర్శి మార్వాడి గంగరాజు, జిల్లా సైన్స్ ఆఫీసర్ పాముల దేవయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పారం లక్ష్మీనారాయణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు చెన్న మాధవుని రామరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment