వంద పట్టణాల్లో ‘డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్’
● కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్ మనోజ్ జోషి
సిరిసిల్ల: దేశంలోని వంద పట్టణాల్లో ‘డిజిటల్ ల్యాండ్ రికార్డులు’ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ దిశగా అధికారులు కార్యాచరణను అమలు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ మనోజ్ జోషి సూచించారు. న్యూఢిల్లీ నుంచి గురువారం నక్షా (నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్)పై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. భూ రికార్డులు డిజిటలైజ్ చేయాలని కేంద్రం నిర్ణయించిందని, వంద పట్టణాల్లో పైలట్ కింద అమలు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డులు డిజిటల్ చేసేందుకు అవసరమైన మ్యాన్‌పవర్, కార్యాలయాలు, సామగ్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. సర్వేయర్లు, వాహనాలు, సామగ్రి ఏర్పాట్ల ప్రణాళికలు తయారు చేయాలన్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ రాష్ట్రంలో పది మున్సిపాలిటీల్లో రీసర్వే చేసి భూ రికార్డులను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. వేములవాడ పట్టణం, నాంపల్లి, తిప్పాపూర్, శాత్రాజుపల్లి, సంకెపల్లి గ్రామాల్లో భూ రికార్డులకు సంబంధించి రీ–సర్వే చేసి డిజిటల్ చేస్తామని వివరించారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్‌డీవో శేషాద్రి, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, టౌన్ ప్లానింగ్ అధికారి అన్సర్, భూరికార్డుల సర్వేయర్ బాలచందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment