నేటి నుంచి కుటుంబ నియంత్రణ శిబిరాలు
● కోత ఉండదు.. కుట్లు వేయరు ● డీఎంహెచ్‌వో వసంతరావు
సిరిసిల్లటౌన్: జిల్లాలో శుక్రవారం నుంచి డిసెంబర్ 3 వరకు పురుషులకు ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల శిబిరం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో వసంతరావు తెలిపారు. కోత, కుట్టు లేకుండా ఆపరేషన్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. సిరిసిల్లలోని ఐఎంఏ హాలులో గురువారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. 29న వేములవాడ, 30న వేములవాడ, సిరిసిల్ల పట్టణ ఆరోగ్య కేంద్రం పీఎస్‌నగర్‌లో, డిసెంబర్ 1న గంభీరావుపేట సీహెచ్‌సీ, 2న వేములవాడ, 3న సిరిసిల్ల పట్టణ ఆరోగ్య కేంద్రం కేంద్రం పీఎస్‌నగర్, వేములవాడ, 4న ఎల్లారెడ్డిపేట సీహెచ్‌సీ, వేములవాడ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాల్లో వేసెక్టమీ శిబిరాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
కుష్టువ్యాఽఽధి నివారణ సర్వే
కుష్టు వ్యాధి నియంత్రణలో భాగంగా ఎల్‌డీసీసీ ఇంటింటీ సర్వే డిసెంబర్ 2 నుంచి ఆశవర్కర్లు ఇంటింటా సర్వే చేపడతారని తెలిపారు. ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు ఇంటింటికీ వచ్చి పరిశీలించి, వ్యాధి నిర్ధారణ కోసం పీహెచ్‌సీలకు పంపిస్తారని తెలిపారు.
ఇమ్యూనైజేషన్ టీకాల శిక్షణ
వ్యాధి నిరోధక టీకాలపై నిర్వహించిన శిక్షణ శిబిరంలో డీఎంహెచ్‌వో వసంతరావు మాట్లాడారు. హైదరాబాద్‌కు చెందిన వైద్యులు అతుల్, జ్యోష్ణ, మురారి రాజేంద్రప్రసాద్ వ్యాధి నిరోధక టీకాలపై వైద్యశాఖ సిబ్బందికి శిక్షణనిచ్చారు. వైద్యాధికారులు పెంచలయ్య, రజిత, నయీమ, వైద్యఽశాఖ ఏవో చేపూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment