పాముకాటు బాధిత బాలుడికి ఆర్థిక సహాయం | - | Sakshi
Sakshi News home page

పాముకాటు బాధిత బాలుడికి ఆర్థిక సహాయం

Published Fri, Jan 10 2025 1:19 AM | Last Updated on Fri, Jan 10 2025 1:19 AM

పాముక

పాముకాటు బాధిత బాలుడికి ఆర్థిక సహాయం

సిరిసిల్ల: ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి బీసీ సంక్షేమ హాస్టల్‌లో పాముకాటుకు గురైన బాలుడి కుటుంబానికి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా రూ.1.50లక్షల ఆర్థిక సాయాన్ని గురువారం అందించారు. ముస్తాబాద్‌ మండలం సేవాలాల్‌తండాకు చెందిన రమావత్‌ చందు, రజిత దంపతుల కొడుకు రోహిత్‌ గాలిపెల్లిలోని బీసీ సంక్షేమ హాస్టల్‌లో చదువుతున్నాడు. ఇటీవల పాముకాటుకు గురై కోలుకున్నాడు. వైద్యఖర్చుల కోసం రూ.1.50 లక్షల చెక్కును కలెక్టర్‌ అందించారు. అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ పాల్గొన్నారు.

మురికికి చెక్‌

వేములవాడ: పట్టణం నుంచి వెలువడుతున్న మురికినీరు కట్టుకాల్వ ద్వారా గుడిచెరువు, మూలవాగులోకి చేరుతున్న విషయంపై ‘సాక్షి’లో గతంలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనికి స్పందించిన ప్రభుత్వం మురికినీటిని డైవర్షన్‌ చేసేందుకు రూ.2.30కోట్లు మంజూరు చేసిందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ గురువారం తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

వడ్డీలేని రుణాలతో ఆర్థికాభివృద్ధి సాధించాలి

అడిషనల్‌ డీఆర్డీవో శ్రీనివాస్‌

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వడ్డీలేని రుణాలతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని అడిషనల్‌ డీఆర్డీవో శ్రీనివాస్‌ కోరారు. ఎల్లారెడ్డిపేటలోని కావేరి మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం అధ్యక్షురాలు బైరి జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బ్యాంక్‌ లింకేజీ, సీ్త్రనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్త బైలా ప్రకారం గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల పాలకవర్గాలను ఎన్నుకోవాలని సూచించారు. డీపీఎం పద్మయ్య, జిల్లా ఏపీఎం రాజేశం, ఏపీఎం మల్లేశం, సీసీలు మంగ్యానాయక్‌, దేవేందర్‌, సుదర్శన్‌, నాగరాజు, సుధాకర్‌, రమణ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

నామాపూర్‌ పల్లగుట్టపై సోలార్‌ప్లాంట్‌

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మహిళల భాగస్వామ్యంతో మండలంలోని నామాపూర్‌లో గల పల్లగుట్టపై సోలార్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్లు డీఆర్‌డీఏ శేషాద్రి తెలిపారు. ఈమేరకు సోలార్‌ప్లాంట్‌ ఏడీఏ లక్ష్మీకాంతారావుతో కలిసి గురువారం పరిశీలించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.40కోట్లతో 10 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. ఇందులో 10 శాతం మహిళలు చెల్లిస్తే, మిగతా సొమ్ము ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు. ప్రతీ యూనిట్‌పై మహిళా సమాఖ్యకు కమీషన్‌ అందుతుందని తెలిపారు. తహసీల్దార్‌ సురేష్‌, ఆర్‌ఐ రఘు, ఎంపీడీవో బీరయ్య, ఏపీఎం దేవరాజు పాల్గొన్నారు.

పరిహారం ఇచ్చి ఆదుకోండి

సిరిసిల్లటౌన్‌: మిడ్‌మానేరు ముంపు బాదితులను ఆదుకోవాలని సంకెపల్లి వాసులు కోరా రు. కలెక్టరేట్‌కు గురువారం తరలివచ్చిన గ్రామస్తులు విలేకరులతో మాట్లాడారు. గ్రామంలోని 45 ఇళ్లకు సంబంధించి జనరల్‌ అవార్డు చేసి నష్టపరిహారం అందించాలని కోరారు. మారవేని రాజయ్య, కొండయ్య, దేవయ్య, అంజయ్య, నారాయణ, మల్లయ్య తదితరులు కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పాముకాటు బాధిత బాలుడికి ఆర్థిక సహాయం
1
1/3

పాముకాటు బాధిత బాలుడికి ఆర్థిక సహాయం

పాముకాటు బాధిత బాలుడికి ఆర్థిక సహాయం
2
2/3

పాముకాటు బాధిత బాలుడికి ఆర్థిక సహాయం

పాముకాటు బాధిత బాలుడికి ఆర్థిక సహాయం
3
3/3

పాముకాటు బాధిత బాలుడికి ఆర్థిక సహాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement