ముక్కోటికి ముస్తాబు
సిరిసిల్లటౌన్: ముక్కోటి ఏకాదశికి సిరిసిల్లలోని శ్రీవేంకటేశ్వరాలయం ముస్తాబైంది. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా భారీ సెట్టింగులతో ఆలయాన్ని సుందరీకరించారు. దశావతరాలు, సెల్ఫీ పాయింట్, ఆల య ప్రాంగణంలో సంగీత కచేరీలను ఏర్పాటు చేశా రు. ఉదయం 4 గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇస్తారని ఆలయ ఈవో మారుతిరావు తెలిపా రు. ఉదయం 10 గంటలకు పురవీధుల్లో శ్రీవారి గరుడసేవా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పండుగకు ముందే వేతనాలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సిరిసిల్ల సింగిల్‌విండో చైర్మన్ బండి దేవదాస్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో సిబ్బందికి వేతనాలు చెల్లించలేదని తెలుపుతూ ‘పండుగపూట పస్తులేనా?’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా సహకార అధికారి టి.రామకృష్ణ గురువారం ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు కేంద్రాల సిబ్బంది 60 మందికి ప్యాడీ, గన్నీ రికన్సిలేషన్ తర్వాత వేతనాలు చెల్లిస్తామని తెలిపారు. సింగిల్‌విండో సీఈవో నరేశ్ స్పందిస్తూ చైర్మన్ బండి దేవదాస్ ఫోన్‌కాల్‌లో అందుబాటులోకి వచ్చారని వేతనాలకు సంబంధించిన రికార్డులు సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment