భూమి కోసం కదలిన గ్రామస్తులు
● ర్యాలీగా వచ్చిన బండలింగంపల్లి గ్రామస్తులు ● తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కబ్జాదారుల నుంచి భూమిని రక్షించాలని కోరుతూ మండలంలోని బండలింగంపల్లి గ్రామస్తులు గురువారం మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. మండలంలోని బండలింగంపల్లి శివారులో 262 సర్వేనంబర్‌లో 11.38 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని గ్రామంలోని అన్ని కులసంఘాలు కలిసి గ్రామ అవసరాల కోసం అభివృద్ధి పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఈక్రమంలోనే ఓ సామాజికవర్గానికి చెందిన వారు ఆ భూమిని కబ్జా చేస్తున్నారు. గ్రామంలో పంచాయితీలు పెట్టిన వారు వినకుండా దౌర్జన్యంగా భూఆక్రమణకు పాల్పడుతుండడంపై గ్రామస్తులు కన్నెర్రజేశారు. అన్ని కులలాకు చెందిన 200 మంది మండల కేంద్రానికి గురువారం చేరుకొని ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. భూమిని రక్షించాలంటూ తహశీల్దార్ రామచంద్రంకు వినతిపత్రం అందించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తహసీల్దార్ హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment