మంచు కురిసే... మనసు మురిసే..
తెరలు..తెరలుగా మంచుకురుస్తుంటే.. మేఘాలను చీల్చుకొని ఎప్పుడెప్పుడు బయటపడుదామన్న ఆతృతలో సూర్యుడు.. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ వడివడిగా అడుగులు వేస్తున్న జనంతో సిరిసిల్ల మానేరువాగు సందడిగా మారింది. బతుకమ్మఘాట్ వద్ద ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల కర్రసాము శిక్షణ ఒక వైపు.. పోలీస్ డిస్ట్రిక్ట్‌గార్డ్స్ కసరత్తులు మరోవైపు.. పిల్లల ఫుట్‌బాల్ ప్రాక్టీస్ ఇంకోవైపుతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. కనిష్ట ఉష్ణోగ్రతలను లెక్కచేయని జనానికి నులివెచ్చదనం అందించేందుకు భానుడు తన సూర్యకిరణాలతో శుభోదయం పలికాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment