● చేనేత పరిశ్రమకు ప్రభుత్వ చేయూత ● కార్మికులకు రూ.5లక్షల బీమా ● భరోసా ఏటా రూ.18వేలు
సిరిసిల్లకల్చరల్: చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అభయహస్తంలో భాగంగా మరిన్ని పథకాలను చేర్చింది. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేతన్న పొదుపు, నేతన్నభరోసా, నేతన్న భద్రత పేరిట మూడు పథకాలను రూపకల్పన చేసింది. నేతన్న పొదుపు పథకంలో భాగంగా కాలపరిమితిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదించింది. ఈ రెండేళ్లలో చేనేత కార్మికుడు తన వాటాగా వేతనంలో 8 శాతాన్ని పొదుపు చేయాలి. ప్రభుత్వం తన వాటాగా 16 శాతాన్ని జమచేయనుంది. మరమగ్గాల కార్మికుడు 8 శాతం పొదుపు చేసే మరో 8 శాతాన్ని ప్రభుత్వం జమచేస్తుంది. గరిష్టంగా ప్రతీ కార్మికుడు ఏటా రూ.1,200 జమ చేసుకునేందుకు అర్హులుగా నిర్ణయించింది. నేతన్న భద్రత పథకం కింద కార్మికుడు ఏ కారణం చేతనైనా మరణిస్తే వారి నామినీకి రూ.5లక్షలు అందజేయనున్నారు. వృత్తిలో కొనసాగుతూ వయసుతో సంబంధం లేకుండా కార్మికులందరికీ ఈ పథకాన్ని అమలుచేసేలా తగినన్ని నిధులు విడుదల చేసింది. నేతన్న భరోసా కింద చేనేత కార్మికునికి ఏటా రూ.18వేలు, చేనేత అనుబంధ కార్మికులకు రూ.6వేల చొప్పున ప్రతీ సంవత్సరం అందేజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment