సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రం శుక్రవారం ఆధ్యాత్మికశోభను సంతరించుకుంది. ముక్కోటి ఏకాదశి వేడుకలు పట్టణంలో అన్ని వైష్ణవాలయాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయంలో ఉదయం 3.30 గంటల నుంచే భక్తులు వైకుంఠద్వార దర్శనం కోసం బారులు తీరారు. ఉదయం 11 గంటలకు నిర్వహించిన గరుడసేవలో వేలాది మంది పాల్గొన్నారు. కోలాటం, భజనలతో మాఢవీధులు మార్మోగాయి. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు రవీందర్, సిబ్బంది ఏర్పాట్లు చేయించారు. విద్యుత్‌దీపాల అలంకరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలరించాయి. సిరిసిల్లటౌన్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ పట్టణ ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్‌గౌడ్, ప్రముఖులు సంగీతం శ్రీనివాస్, అర్చకస్వాములు కృష్ణమాచారి, వేణుగోపాలాచారి, సుకుమారాచారి, వర్ధనాచారి, శ్రీనివాసాచారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment