జాతీయస్థాయికి దమ్మన్నపేట విద్యార్థి
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం దమ్మన్నపేట హైస్కూల్ విద్యార్థి చిప్పల విశాల్ జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యాడు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో విశాల్ ప్రదర్శనకు జాతీయస్థాయి ఎంపికై ంది. గైడ్ టీచర్ తాడూరి సంపత్‌కుమార్‌ను, విద్యార్థి విశాల్‌ను ఉపాధ్యాయులు అభినందించారు. పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ, కొమురయ్య, రాజు, నారాయణ, కవిత, విజయశ్రీ పాల్గొన్నారు.
చంద్రంపేటలో వర్క్‌సైట్ స్కూల్ ప్రారంభం
● 28 మంది బడీడు పిల్లల గుర్తింపు
● డీఈవో జగన్మోహన్‌రెడ్డి
సిరిసిల్లఎడ్యుకేషన్: మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట శివారులోని ఇటుక బట్టీలలో 28 మంది బడీడు పిల్లలను గుర్తించి పనిస్థలం వద్ద వర్క్‌సైట్ స్కూల్‌ను శుక్రవారం ప్రారంభించినట్లు జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. బట్టి యజమాని ఎండీ అన్వర్‌తో పిల్లల కోసం షెడ్ నిర్మింపజేయడంతోపాటు నోట్‌బుక్స్, పుస్తకాలు, పలకలు, బ్యాగులు సమకూర్చినట్లు తెలిపారు. బడీడు పిల్లలను గుర్తించిన సెక్టోరల్ ఆఫీసర్ శైలజ, సీఆర్పీ రవికిరణ్‌ను డీఈవో అభినందించారు. ఎంఈవో రఘుపతి పాల్గొన్నారు.
రైతుహామీలు నెరవేర్చాలి
సిరిసిల్లటౌన్: ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. జిల్లా కేంద్రంలోని బీవైనగర్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం రైతుబంధు కింద రూ.10వేలు ఇస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుభరోసా కింద రూ.15వేలు, కౌలురైతులకు రూ.12వేలు ఇస్తామని చెప్పి ఇప్పటీకీ అమలు చేయడం లేదన్నారు. యాసంగి సీజన్‌లోనైనా రైతుభరోసా వస్తుందేమోనని రైతులు ఆశగా చూస్తున్నారన్నారు. గన్నారపు నర్సయ్య, మల్లారం అరుణ్‌కుమార్, అన్నల్‌దాస్ గణేశ్, మల్లారం ప్రశాంత్, శ్రీరాముల రమేశ్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ట్రేడ్ లైసెన్సులు రెన్యూవల్ చేసుకోవాలి
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల పట్టణంలోని దుకాణదారులు 2024–25 సంవత్సరానికి ట్రేడ్‌లైసెన్సు ఫీజు చెల్లించి, రెన్యూవల్ చేసుకోవాలని ఎస్సై సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఫీజు చెల్లించకుంటే ఎలాంటి నోటీస్‌లు ఇవ్వకుండా దుకాణాలను మూసివేయిస్తామని హెచ్చరించారు.
నేడు దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ
సిరిసిల్లకల్చరల్: జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు కేంద్ర హోమ్‌శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ చేతులమీదుగా శనివారం సహాయ ఉపకరణాల పంపిణీ చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన శిబిరాల్లో అర్హులను గుర్తించారు. రూ.70లక్షల విలువైన 675 పరికరాలు అందజేయనున్నారు. బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిళ్లు, వీల్‌చేయిర్లు, వినికడి పరికరాలు, సుగమ్య కేన్, ఆక్సిలరీ క్రచెస్, ఎల్బో క్రచెస్ పంపిణీ చేస్తారు.
ఫిషరీస్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి
సిరిసిల్లటౌన్: గత ప్రభుత్వం 600 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామన్న ఫిషరీస్ పరిశ్రమను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. కార్మిక భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో ఫిషరీష్ పరిశ్రమను ఏర్పాటుకు 600 ఎకరాలు సేకరించి, 300 ఎకరాలకు పరిహారం చెల్లించిందన్నారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఫిషరీస్ పరిశ్రమను పట్టించుకోకవపోవడంతో యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ నాయకులు పంతం రవి, సోమ నాగరాజు, బాచుపల్లి శంకర్, శ్రావణపల్లి మల్లేశం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment