కమలం ఖరారు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఎమ్మెల్సీ అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి టీచర్స్, గ్రాడ్యుయేట్స్ స్థానాలకు పోటీ చేసేవారి జాబితా శుక్రవారం విడుదల చేసింది. టీచర్స్ ఎమ్మెల్సీకి పెద్దపల్లి జిల్లా బంధంపల్లికి చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్కా కొమురయ్యను, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి మెదక్ జిల్లా రామచంద్రాపురానికి చెందిన అంజిరెడ్డి పేరు ప్రకటించింది.
ఆర్‌ఎస్‌ఎస్‌తో సత్సంబంధాలు..
మల్కా కొమురయ్యది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు లక్ష్మి–వెంకటయ్య. ఆయన పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో పాఠశాల విద్య పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ చదివారు. హైదరాబాద్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి స్కూల్ స్థాపించి ఎంతోమందికి విద్యనందించారు. మొదటినుంచి స్వయం సేవక్‌గా ఆర్‌ఎస్‌ఎస్‌లో కొనసాగుతున్న కొమురయ్యకు బీజేపీ అధిష్టానంతోపాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో సత్సంబంధాలున్నాయి. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి టికెట్ ఆశించారు. అయినా, ఈటల రాజేందర్ కోసం పనిచేసి, గెలిపించారు. కొమురయ్యకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయింపుపై స్థానిక బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీతో అనుబంధం..
అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. ఆయన సతీమణి గోదావరి పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు. విద్యావంతుడు, పారిశ్రామికవేత్త అయిన అంజిరెడ్డిని బలమైన అభ్యర్థిగా ఆ పార్టీ భావించి, పట్టభద్రుల అభ్యర్థిగా ప్రకటించింది. ఎస్.ఆర్. ట్రస్టు ద్వారా రెండు దశాబ్దాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు విద్య, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే, కోవిడ్ సమయంలో సేవలందించారు. మరోవైపు పార్టీ పరంగా సంగారెడ్డి జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో పోటీ..
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులను ముందే ప్రకటించాయి. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు కమలం ముందుగా అభ్యర్థులను ప్రకటించడం విశేషం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రేపోమాపో ఖరారు చేసే అ వకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి, పార్టీ నేత వెలిచా ల రాజేందరావు, బీఆర్‌ఎస్ నుంచి మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఎన్.రావు, ట్రస్మా నాయకుడు యాదగిరి శేఖర్‌రావు మధ్య పోటీ ఉంది. మాజీ డీఎస్పీ గంగాధర్, మాజీ లెక్చరర్ ప్రసన్న హరికృష్ణ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా అంజిరెడ్డి
టీచర్స్ స్థానానికి మల్కా కొమురయ్య
ఇద్దరూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు
రేపోమాపో ప్రకటించనున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్
Comments
Please login to add a commentAdd a comment