సిరిసిల్లక్రైం: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరుకు చెందిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని విచారిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పెద్దూరుకు చెందిన గంగయ్య, బాలరాజులను శుక్రవారం అదుపులోకి తీసుకొని అక్రమ భూరిజిస్ట్రేషన్ విషయంలో విచారణ చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఈ విషయమై సిరిసిల్లటౌన్ సీఐ కృష్ణను సంప్రదించగా విచారణ కోసం ఇద్దరిని తీసుకొచ్చినట్లు తెలిపారు.
యూత్ డిక్లరేషన్ అమలు చేయండి
సిరిసిల్లటౌన్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన యూత్ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచాలని ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలన్నారు. యూత్ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలు.. ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి రూ.4వేలు, యూత్ కమిషన్ ఏర్పాటు హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శనిగరపు రజనీకాంత్, మల్లారపు అరుణ్‌కుమార్, మల్లారపు ప్రశాంత్, శ్రీరాముల రమేశ్‌చంద్ర, జాలపల్లి మనోజ్‌కుమార్, కుర్ర రాకేశ్, గుండెల్లి కల్యాణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment