ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండలంలోని గూడూరు పిండి వంటలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి మహిళలు ఇళ్లలోనే రుచికరమైన సకినాలు, గారెలు, మురుకులు, బూందీ లడ్డూ, కారపూస, అరిసెలు, భక్షాలు తయారు చేసి, దేశ విదేశాలకు ఆర్డర్‌పై పంపిస్తున్నారు. సంక్రాంతికి 10 రోజుల ముందే హైదరాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి ప్రాంత ప్రజలు ఆర్డర్‌పై తయారు చేయించుకుంటారు. గూడూరులో 5 కుటుంబాలకు చెందిన మహిళలు పిండి వంటల తయారీ ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. ఏడాది పొడువునా వీరికి అప్పాల గిరాకీ ఉంటుంది. ఇంగ్లండ్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయ్, మస్కట్, బహ్రెయిన్ తదితర దేశాలకు పంపిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment