సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల జారీ, ప్యానల్ బోర్డుల మంజూరులో జరుగుతున్న జాప్యంపై ‘సాక్షి’ జిల్లా ఎడిషన్‌లో ‘డిస్కంలో వసూళ్ల దందా’ శీర్షికన ప్రచురితమైన కథనంపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో తీవ్ర దుమారమే చెలరేగింది. ఏ సర్కిల్ పరిధిలో ఎన్ని ప్యానల్ బోర్డులు పెండింగ్‌లో ఉన్నాయి? ఎన్ని డీటీఆర్‌లు మంజూరు చేశారు? కొత్తగా ఎన్ని మీటర్లు జారీ చేశారు? లైన్ షిఫ్టింగ్ వర్కులు ఎన్ని పూర్తిచేశారు? వాటి ఎస్టిమేషన్లు? ఇప్పటి వరకు ఎన్ని మీటర్లు మార్చారు..? వంటి అంశాలపై సెక్షన్ల వారీగా రంగారెడ్డి జోన్ సీజీఎం ఆనంద్ సమగ్ర నివేదిక కోరారు. అదే విధంగా ఇబ్రహీంపట్నంలో సిబ్బంది చేతివాటంపై విచారణకు ఆదేశించారు. విద్యుత్ శాఖలో అవినీతికి పాల్పడే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రూ.2,843 డీడీ కట్టారు: ఏడీఈ
ఇదిలా ఉండగా ఈ అంశంపై ఇబ్రహీంపట్నం ఏడీఈ సైదులు ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. మీటర్ జారీ విషయంలో లైన్‌మన్ డబ్బులు డిమాండ్ చేసిన విషయంలో వాస్తవం లేదన్నారు. అడగకపోయినా.. సదరు వినియోగదారుడే స్వయంగా తమ జూనియర్ లైన్‌మెన్‌కురూ.4 వేలు ఇచ్చారని, ఇందులో రూ.2843 కొత్త మీటర్ కోసం డీడీ కట్టినట్లు చెప్పడం గమనార్హం.
‘సాక్షి’ కథనంపై స్పందించిన సీజీఎం
Comments
Please login to add a commentAdd a comment